Mahavatar Narasimha: థియేటర్లను షేక్ చేస్తున్న మహావతార్ నరసింహా..ఓటీటీలో ఎప్పుడంటే..
Mahavatar Narasimha:మహావతార్ నరసింహా చూశావా? అడుగు పెట్టిన ప్రతి చోటా ఇదే మాట వినిపిస్తోంది. వెబ్లో ట్రెండింగ్, థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డ్స్

Mahavatar Narasimha
మహావతార్ నరసింహా చూశావా? అడుగు పెట్టిన ప్రతి చోటా ఇదే మాట వినిపిస్తోంది. వెబ్లో ట్రెండింగ్, థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డ్స్. భారీ హైప్ లేకుంటే ఏదో వచ్చేసిన అనిమేషన్ మూవీ అనుకున్నారంతా. కానీ విడుదలైనవెంటనే మాస్ బజ్ తో పిక్ చేసుకొని సంచలనంగా మారింది ‘మహావతార్ నరసింహా.’ మాస్ నుంచి క్లాస్ వరకు, ఫ్యామిలీస్ నుంచి కిడ్స్ వరకు… ఎవరు చూసినా అదే డైలాగ్..ఇది తప్పకుండా చూడాల్సిందే అని.
ఈ యానిమేషన్ మూవీ బడ్జెట్ పరంగా పెద్దగా లోడే లేదు . కేవలం 15 కోట్లు. కానీ వసూళ్లలో మాత్రం పరుగులు తీస్తూనే ఉంది. ఇండియాలోనే 105 కోట్ల క్యాష్! గ్లోబల్గా 120 కోట్లు దాటి రికార్డు హిట్. ఎంతగా అంటే, ఇండియన్ యానిమేషన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇవాళ్ది మైలురాయి. ఎక్కడ చూసినా టికెట్ల కొరత, బుకింగ్ కావాలంటే ముందే ఫస్ట్ షోకి ప్లాన్ చేసుకోవాలని సలహాలు.

అసలు ఈ సినిమాకు ఈ గ్రూప్ మేనియా ఎందుకు వచ్చిందంటే..ఎప్పటికీ రొటీన్ గాడ్స్, మామూలు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఊహించేసిన వీజువల్స్ కాకుండా, క్లీన్ స్టోరీ టెల్లింగ్, స్పెషల్ సిన్మాటిక్ విభిన్నత, క్విక్ గా ఆఫీస్కు జంప్ అవ్వడం ఇవే ఈ మూవీ సీక్రెట్స్.
ఇంకా, పబ్లిసిటీ పెద్దగా లేదు, ప్రమోషన్స్ కూడా బాగా లేవు.కేవలం మౌత్ పబ్లిసిటీ( Mouth publicity) మాత్రమే. స్టార్స్, రివ్యూస్ కంటే, చూసినవాళ్లు “పక్క వాళ్లను తీసుకెళ్లండి” అని చెబితేనె సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు… అదే ఇక్కడ జరిగింది.
తాజాగా మహావతార్ నరసింహా (Mahavatar Narasimha) ఓటీటీ మీద భారీ సస్పెన్స్ మెయిన్‌టెన్ అవుతోంది. ఇక థియేటర్ రన్ అయిపోయింది, ఇంకో రెండు నెలల్లో డిజిటల్ రిలీజ్( Digital release) ఖాయం!” అంటూ సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్, లీక్‌ల హడావిడి మొదలయింది. సెప్టెంబర్ మరీ లేదంటే అక్టోబర్‌లో ఓటీటీ సందడి ఫిక్స్ అన్న టాక్ కూడా నడుస్తోంది. దీంతో అందరూ ఓటీటీ డేట్ కోసం వచ్చే బ్రేకింగ్ న్యూస్ కోసమే వెయిట్ చేస్తున్నారు.