OTT : ఈ వారం ఓటీటీలో 30కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఛాయిస్ మీదే
OTT : నెట్‌ఫ్లిక్స్‌లో 'తమ్ముడు', యూట్యూబ్‌లో 'సితారే జమీన్ పర్' సినీ లవర్స్‌కు పండుగే ఇక

OTT
ఈ వారం ఓటీటీ(ott) ప్లాట్‌ఫామ్‌లలో సినిమా ప్రియులకు పెద్ద పండుగే. ఏకంగా 30కి పైగా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్లలో సందడి చేసిన కొన్ని చిత్రాలు ఓటీటీలోకి రాగా, కొత్త కథాంశాలతో రూపొందిన సిరీస్‌లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం డిజిటల్ స్క్రీన్‌పై మెరిసిన కొన్ని ముఖ్యమైన సినిమాలు, సిరీస్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్( Netflix)లో ‘తమ్ముడు’ సందడి..నితిన్ (nithin)హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తమ్ముడు'(Thammudu). ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ ఎమోషనల్ డ్రామా సినిమా, ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలు కలగలిసిన ఈ సినిమా ఇప్పుడు ఇంట్లో కూర్చొని హాయిగా చూడవచ్చు.

యూట్యూబ్‌లో అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్.. అమీర్ ఖాన్ ‘(Aamir Khan) కీలక పాత్రలో నటించిన ‘సితారే జమీన్ పర్’ అనే ఎమోషనల్ మూవీ థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనని అమీర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఈ చిత్రాన్ని ఆగస్టు 1 నుంచి యూట్యూబ్‌లో రెంట్’ పద్ధతిలో చూసేందుకు అవకాశం కల్పించారు. అంటే సినిమాను ఆన్‌లైన్‌లో చూడటానికి మనీ పే చేయాలన్నమాట.

‘ఓ భామ… అయ్యో రామ’తో కామెడీ డోస్.. సుహాస్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ సినిమా ‘ఓ భామ… అయ్యో రామ’. రామ్ గోదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సరదాగా, నవ్వించే కథాంశంతో ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

అమెజాన్ ప్రైమ్‌లో ‘3 బీహెచ్‌కే’.. సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్ తండ్రీకొడుకులుగా నటించిన సినిమా ‘3 బీహెచ్‌కే’. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం ఒక మధ్యతరగతి కుటుంబం పడే కష్టాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో: హిందీలో ‘హౌస్‌ఫుల్’, కన్నడలో ‘సీస్ కడ్డీ’, మరాఠీలో ‘ఏప్రిల్ మే 99’తో పాటు పలు ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్‌లు. ‘నథింగ్ బట్ లవ్’ అనే తెలుగు, తమిళ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్: ‘నాన్న’, ‘రెడ్ శాండిల్‌వుడ్’ సినిమాలు.
జీ5: హిందీ, తమిళ భాషల్లో ‘బకేతి’ అనే వెబ్‌సిరీస్.
నెట్‌ఫ్లిక్స్: ‘డూ లిటిల్’, ‘మై ఆక్స్‌ఫర్డ్స్ ఇయర్’ వంటి ఇంగ్లీష్ సినిమాలు, ‘ది శాండ్‌మ్యాన్’ సీజన్ 2, ‘లియాన్’ లాంటి ఇంగ్లీష్ సిరీస్‌లు, కొరియన్, జపనీస్ సిరీస్‌లు కూడా వచ్చాయి.
హాట్‌స్టార్: ‘బ్లాక్ బ్యాగ్’ వంటి ఇంగ్లీష్ సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి.