Just EntertainmentLatest News

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పవన్, బన్నీ మల్టీస్టారర్ మూవీ..మెగా ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే!

Lokesh Kanagaraj: కొద్ది రోజులుగా లోకేష్ కనగరాజ్ ఎవరితో సినిమా చేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

Lokesh Kanagaraj

టాలీవుడ్ సినీ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక భారీ మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధమైందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరు టాప్ స్టార్స్ చేతులు కలపబోతుండటం విశేషం. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యాన్స్ , అల్లు ఫ్యాన్స్ ఇన్నాళ్లుగా ఏ రోజైతే రావాలని కోరుకున్నారో, ఆ కల త్వరలోనే నిజం కాబోతోందని సమాచారం.

వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌ను హ్యాండిల్ చేయబోయే బాధ్యత తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు దక్కినట్లు తెలుస్తోంది. లోకేష్(Lokesh Kanagaraj) గతంలో ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ (LCU) క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమా చేస్తున్నారనే వార్త సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది.

కొద్ది రోజులుగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఎవరితో సినిమా చేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మొదట రామ్ చరణ్ అని, ఆ తర్వాత అల్లు అర్జున్ అని ప్రచారం జరిగింది. ఒక దశలో చరణ్ , బన్నీ కలిసి నటిస్తారని కూడా టాక్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం, లోకేష్ రాసుకున్న ఒక హై-వోల్టేజ్ యాక్షన్ స్క్రిప్ట్‌కు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ ఇద్దరూ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

Lokesh Kanagaraj
Lokesh Kanagaraj

రీసెంట్ గానే లోకేష్(Lokesh Kanagaraj) ఈ ఇద్దరు స్టార్స్ కు కథ వినిపించారని, ఆ కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా వారు ఓకే చెప్పారని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును తమిళ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత లోహిత్ ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదని, ఈ సినిమా డేట్స్ మరియు ప్లానింగ్ కోసమేనని ఇప్పుడు అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నా .. ఈ ప్రాజెక్ట్ ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఘనవిజయంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు మాస్ లీడర్స్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. 2026 సంక్రాంతి కానుకగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button