Film workers:సినీ కార్మికుల పోరాటానికి డెడ్ లైన్ దగ్గరకొస్తోంది..ఎండ్ కార్డ్ ఎప్పుడు?
Film workers: వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్‌కు చాంబర్ పూర్తిస్థాయి అంగీకారం లేదని తేలడంతో, కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు.

Film workers
2025 ఆగస్టు మొదటి వారం నుంచి టాలీవుడ్లో చిరకాలం గుర్తుండే విధంగా కార్మికులు, నిర్మాతల మధ్య వేతనాల వివాదం భారీ ఎత్తున తెరకెక్కుతోంది. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తాజాగా మీడియా సమావేశంలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి.
ఫిలిం ఛాంబర్,ఫెడరేషన్ చర్చలు విఫలమవడంతో..అంటే వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్‌కు చాంబర్ పూర్తిస్థాయి అంగీకారం లేదని తేలడంతో, కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు. 24 క్రాఫ్ట్ విభాగాల కార్మికులంతా ఉద్యమంలో పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కారం కానిపోతే ఛాంబర్‌ను ముట్టడించడమే కాదు, నిరాహార దీక్ష చేపడతాం, అన్ని షూటింగ్స్‌ను ఆపేస్తాం,” అని ఫెడరేషన్ స్టాండ్ స్పష్టంగా ఉంది.
ప్రతి ఏడాది 10% చొప్పున పెంచాలని కార్మికులు(film workers) కోరుతున్నారు. కానీ నిర్మాతలు మూడు సంవత్సరాలు కలిపి 15%, ఇంకా కొన్ని ఘట్టాల్లో 5% చొప్పున మాత్రమే పెంపుపై ఒప్పుకుంటున్నారు. అదీ పెద్ద చిత్రాల్లో మాత్రమే, రూ.1500 లోపు వేతనం పొందేవారికే పెరిగే అవకాశం – మిగిలిన వారికి NO అని నిరాకరిస్తున్నారు. అయితే వేతన పెంపు అందరికీ, అన్ని విభాగాల్లో సమానంగా వర్తించాలనుకుంటే మాత్రమే చర్చలకి వస్తామని కార్మికులు అంటున్నారు.
మాకు నచ్చిన వారిని తీసుకుంటామంటూ, కొందరు నిర్మాతలు స్కిల్స్ లేవంటూ కార్మికులను (Film workers)విమర్శిస్తున్నారు. వేతనపు మాట వచ్చాకే స్కిల్స్ గుర్తొచ్చాయా అంటూ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ వేతనాలు ఇస్తోంది, ఒక్కసారిగా 30% పెంచడం అందరికీ సాధ్యపడదు, చిన్న నిర్మాతలు ఇండస్ట్రీకి దూరమవుతారనే వాదనతో నిర్మాతలు ఉన్నారు.
చిన్న చిత్రాల కోసం వేతనం ఎప్పటిలాగే ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2,000/- లోపు రోజువారీ వేతనదారులకు మాత్రమే ఫేజ్కల పెంపు – మొదటి ఏడాది 15%, రెండో, మూడో సంవత్సరాల్లో 5% చొప్పున పెంచేలా ముందుకువస్తున్నారు.
యూనియన్ సమ్మెను దృష్టిలో పెట్టుకొని దర్శకులు, స్టూడియోలు యూనియన్లతో ఈ విషయంలో ఎటువంటి చర్చలు జరిపొద్దంటూ TFCC (Film Chamber) స్పష్టంగా తెలిపింది.

అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి చిరంజీవి, బాలకృష్ణ వంటివారు వెనక నిలబడి బలమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అసలు పరిష్కారం ఫిలిం ఛాంబర్లోనే తేలాలని ఫెడరేషన్ నేతలు చెప్తున్నారు.
నిర్మాత విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించగా, కార్మికులు కోర్టు తీర్ప్ వచ్చే వరకు ఆయన సినిమా షూటింగులకు హాజరవుతున్నామని చెప్పారు.అయితే షెడ్యూల్లో ఉన్న షూటింగ్స్‌కు రెండు రోజులు గడువు ఇచ్చారు. ఆ తరువాత అన్ని షూటింగ్స్ నిలిపివేయాలని ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సమస్య వల్ల టాలీవుడ్ వేలాది కార్మిక (Film workers) కుటుంబాలకు ఉపాధి నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అసలు నిజమైన పరిష్కారం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. మరి ఈ వివాదానికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందనేది చూడాలి.