Vijay Deverakonda: అమెరికాలో విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం..
Vijay Deverakonda: ఆగస్ట్ 17న న్యూయార్క్ మాడిసన్ అవెన్యూ వేదికగా ప్రధాన పరేడ్ జరగనుంది.

Vijay Deverakonda
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్నలకు అరుదైన గౌరవం లభించింది. ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాతో భారీ విజయం సాధించిన విజయ్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరవనున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్‌లో ఈ ఇద్దరు స్టార్స్ కో-గ్రాండ్ మార్షల్స్గా సందడి చేయనున్నారు. ఇది మన తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం.
1981లో ఒక చిన్న పరేడ్‌గా మొదలైన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే వేడుకగా మారింది. విదేశాల్లో భారతీయ సంస్కృతి, ప్రతిష్టను చాటి చెప్పడం ఈ పరేడ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంవత్సరం పరేడ్ థీమ్‌ను “సర్వే భవంతు సుఖినః” (అందరూ సుఖంగా ఉండాలి)గా ఎంచుకున్నారు. ఆగస్ట్ 17న న్యూయార్క్ మాడిసన్ అవెన్యూ వేదికగా ప్రధాన పరేడ్ జరగనుంది. ఈ వేడుకలకు ముందు, ఆగస్ట్ 15న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై త్రివర్ణ పతాక కాంతులు ప్రసరిస్తాయి, ఆగస్ట్ 16న టైమ్స్ స్క్వేర్‌లో భారత జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతుంది.
And it’s just 5 days to go … 🤩🇮🇳#indiadayparade #IDP25 #fia #fianynjctne #indiadayparadenyc @TimesNow @TNNavbharat @ZoomTV pic.twitter.com/Xfbnxn5Fp0
— FIA NY-NJ-NE (@FIANYNJCTNE) August 12, 2025
ఈ అరుదైన గౌరవంపై విజయ్(Vijay Deverakonda), రష్మిక( Rashmika Mandanna) ఆరు భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్) ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పరేడ్‌లో వారి భాగస్వామ్యం భారతీయ యువతకు, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక కొత్త గుర్తింపును తీసుకువస్తుంది.

కాగా 2022లో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ఈ ప్రతిష్టాత్మక ఇండియా డే పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్-ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్, 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.