Pawan Kalyan : ప్రెస్‌మీట్‌లో పవన్ అలా అనేశారేంటి?
Pawan Kalyan : మామూలుగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) తన కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ ఒక సినిమా కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Pawan Kalyan : మామూలుగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) తన కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ ఒక సినిమా కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘హరిహర వీర మల్లు'(Hari Hara Veera Mallu) మూవీ సోమవారం జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, ఫ్యాన్స్‌నే కాదు, నార్మల్ ఆడియన్స్‌ను కూడా బాగా కనెక్ట్ చేశాయి. తన సినిమాపై, ఇండస్ట్రీపై, ముఖ్యంగా నిర్మాతపై ఆయనకున్న బాండింగ్, రెస్పాన్సిబిలిటీని ఈ సందర్భంగా ఓపెన్‌గా చెప్పారు.
Pawan Kalyan
సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు నిజంగా తెలియదని పవన్ కళ్యాణ్ సింపుల్‌గా అన్నారు. నేనొక యాక్సిడెంటల్ యాక్టర్‌ని. గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యానంటూ తన జర్నీని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రెస్ మీట్‌ను అరేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ నిర్మాత ఏ.ఎం. రత్నం(Producer AM Ratnam) అని చెప్పిన పవన్.. “సినిమా నాకు అన్నం పెట్టింది. ఈ ఇండస్ట్రీతో నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది,” అని ఎమోషనల్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “నిర్మాత రత్నం నలిగిపోతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఆయన మంచితనం శాపంగా మారకూడదు,” అంటూ ఏ.ఎం. రత్నం పట్ల తనకున్న అభిమానాన్ని, రెస్పాన్సిబిలిటీని చాటుకున్నారు. “ఇకపై హరిహర వీర మల్లు సినిమా అనాథ కాదు, నేనున్నాను,” అని బలంగా అనౌన్స్ చేసి ఈ ప్రాజెక్ట్‌పై తనకున్న కమిట్‌మెంట్‌ను చెప్పారని పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. పవన్ మాటలు నిర్మాతకు గ్రేట్ రిలీఫ్ ఇవ్వడమే కాకుండా, మూవీ టీమ్‌కు, ఫ్యాన్స్‌కు కొత్త ఎనర్జీని నింపాయంటూ సంబరపడిపోతున్నారు.
డైరెక్టర్ క్రిష్ ఈ కథను ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌గా తీర్చిదిద్దారని పవన్ అప్రిషియేట్ చేశారు. “క్లైమాక్స్ సీన్ కోసం 56 రోజుల పాటు షూటింగ్ చేశాం, అది చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తుందని తెలిపారు. సినిమా ఎంత సక్సెస్ అవుతుంది అనే దానికంటే, ఈ ఇండస్ట్రీలో నిర్మాత ఏ.ఎం. రత్నంను కాపాడుకోవడమే మెయిన్ అని పవన్ హైలైట్ చేశారు.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి ప్రాణవాయువు లాంటి వారని పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. ఈ మూవీ కోసం తాను ప్రతిరోజూ రెండు గంటలు టైమ్ ఇచ్చినట్లు చెప్పారు. “కొంతమంది నన్ను క్రిటిసైజ్ చేస్తున్నా సరే, నిర్మాతకు అండగా ఉండాలనిపించింది,” అని అన్నారు. “చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా, మేనల్లుడైనా సరే, టాలెంట్ ఉంటేనే నిలబడతాం,” అంటూ సినీ ఇండస్ట్రీలోని రియాలిటీని పవన్ క్లియర్‌గా చెప్పారు.
డైరెక్టర్స్ జ్యోతికృష్ణ, క్రిష్‌లను పవన్ స్పెషల్‌గా అభినందించారు. ఈ సినిమా కోసం అందరూ చేసిన శాక్రిఫైస్‌లను గుర్తు చేసుకుంటూ, సినీ ఇండస్ట్రీకి క్యాస్ట్, రిలీజియన్, రీజినల్ బౌండరీలు లేవని, ఇది ఒక క్రియేటివ్ ఇండస్ట్రీ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎఫ్.డి.సి. ఛైర్మన్‌గా ఏ.ఎం. రత్నం పేరును ప్రపోజ్ చేసినట్లు కూడా ఈ సందర్భంగా అనౌన్స్ చేశారు. “ఈ సినిమా ఆడియన్స్‌కు థియేటర్‌లో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది,” అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు.మొత్తంగా’హరిహర వీర మల్లు’ మూవీ సక్సెస్ ఎంత అనేది తెరపైనే తేలినా, పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం కోట్లాది మంది హృదయాలను టచ్ చేశాయి.