Break for Akhanda: అఖండ 2కి చివరి నిమిషంలో బ్రేక్ ఎందుకు? రేపయినా సమస్య క్లియర్ అవుతుందా?
Break for Akhanda: ముందుగా, తమిళనాడుకు చెందిన ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఈరోస్ (Eros), 'అఖండ 2' నిర్మాతల నుంచి తమకు రావాల్సిన బకాయిలు, నష్టాల కింద 28 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది.
Break for Akhanda
కోట్లాది మంది బాలకృష్ణ అభిమానులు, యాక్షన్ సినిమాలను ప్రేమించే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ సినిమా విడుదల (Break for Akhanda )చివరి నిమిషంలో ఆగిపోవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం, ఊహించని ఆర్థిక, న్యాయపరమైన చిక్కుల వల్ల ఒక్క రోజు ముందు అఖండ 2 తాత్కాలికంగా(break for Akhanda) ఆగిపోయింది.
అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే.. ముందుగా, తమిళనాడుకు చెందిన ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఈరోస్ (Eros), ‘అఖండ 2’ (Break for Akhanda)నిర్మాతల నుంచి తమకు రావాల్సిన బకాయిలు, నష్టాల కింద 28 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, మద్రాస్ హైకోర్టు నుంచి సినిమా విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులను సంపాదించింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఈ న్యాయపరమైన జోక్యం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.
దీనికి తోడు, తెలుగు రాష్ట్రాల్లోని లోకల్ ఫైనాన్షియర్లు కూడా తమ పాత బకాయిలు వెంటనే చెల్లించాలంటూ పట్టుబట్టారట. దీంతో, ఒక్కసారిగా నిర్మాతలు దాదాపు 50 కోట్ల రూపాయల క్లియరెన్స్ భారాన్ని మోయాల్సి వచ్చింది. నిన్నటి నుంచి ఎంత ప్రయత్నించినా, ఇంత భారీ మొత్తాన్ని ఒక్క రోజులో సెటిల్ చేయడం నిర్మాతలకి అసాధ్యంగా మారింది. దీంతో చేసేదేమీ లేక అఖండ 2(break for Akhanda) రిలీజ్ తేదీని వాయిదా వేయక తప్పలేదు.

బాలకృష్ణ లాంటి బిగ్గెస్ట్ స్టార్ సినిమాకు, అదీ అఖండ లాంటి బ్రాండ్‌కు ఇలా జరగడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. నిజానికి, సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలు చాలా క్లిష్టంగా ఉంటాయి. పాత బకాయిలు, మునుపటి ప్రాజెక్టుల నష్టాలు అన్నీ ఈ కొత్త సినిమాకు ముడిపడి ఉంటాయి. ‘అఖండ 2’ భారీ బడ్జెట్, గ్రాండియర్‌తో తెరకెక్కడం వలన, ఫైనాన్స్ సర్దుబాట్లు కూడా అంతే క్లిష్టంగా మారి ఉంటాయి. చివరి నిమిషంలో ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయడం, కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల ఈ దురదృష్టకర పరిస్థితి తలెత్తింది.
అయితే, అభిమానులకు ఒక శుభవార్త ఉంది. తాజా సమాచారం ప్రకారం, నిర్మాతలు డబ్బు చెల్లింపుపై ఇప్పటికే కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. కొంత మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లించేలా ఫైనాన్షియర్లతో చర్చలు జరిపారట. అంతేకాకుండా, సినిమా విడుదల కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులోనూ పోరాడుతున్నారు.
ఈ ఉత్కంఠకు తెరపడే కీలకమైన తీర్పు నేడు మద్రాస్ హైకోర్టులో వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వస్తే, ఈరోస్ సమస్య తాత్కాలికంగా పరిష్కారమైతే, ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేసి, రేపటి నుంచి అంటే డిసెంబర్ 6, శనివారం నుంచి సినిమాను అధికారికంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.




One Comment