Dogs: మూగజీవాల కోసం ఒక తీవ్రవాద సంస్థ ఉందని తెలుసా? ఏంటీ ALF?
Dogs: అసలు ఈ తీవ్రవాద సంస్థ ఎందుకు పుట్టింది? వీరు చేసే పోరాటం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో కూడా చాలామందికి తెలీదు.
Dogs
ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం చాలా పోరాటాలు చూశాం. తమ ప్రాంతం కోసం, తమ జాతి కోసం జరిగే విముక్తి ఉద్యమాల గురించి మనకు తెలుసు. కానీ, ఎప్పుడైనా కుక్క(Dogs)ల విముక్తి కోసం పోరాడే ఒక అండర్‌గ్రౌండ్ సంస్థ గురించి ఎప్పుడైనా విన్నారా? అవును.. మూగజీవాల హక్కుల కోసం, వాటిని బంధనాల నుంచి విడిపించడం కోసం ఒక ప్రత్యేక సంస్థ పనిచేస్తోందని.. దాని పేరు ‘యానిమల్ లిబరేషన్ ఫ్రంట్’ (Animal Liberation Front – ALF) అంటారని చాలామందికి తెలీదు.
దీనిని చాలా దేశాలు ఒక తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంటాయి. ఎందుకంటే వీరి పోరాట శైలి చాలా ఉధృతంగా, చాలా సీక్రెట్‌గా ఉంటుంది. అసలు ఈ సంస్థ ఎందుకు పుట్టింది? వీరు చేసే పోరాటం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో కూడా చాలామందికి తెలీదు.
1976లో లండన్ వేదికగా అంకురార్పణ..1976లో యానిమల్ లిబరేషన్ ఫ్రంట్ (ALF) బ్రిటన్ లోని లండన్ ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. మనుషుల కోసం వైద్య పరిశోధనలు చేసే సమయంలో ప్రయోగశాలల్లో మూగజీవాలపై, ముఖ్యంగా కుక్కలపై చేసే క్రూరమైన ప్రయోగాలను అడ్డుకోవడమే ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. విషపూరితమైన మందులను కుక్కలపై ప్రయోగించి, అవి అనుభవించే నరకాన్ని ప్రపంచానికి చూపించాలని వీరు నిర్ణయించుకున్నారు.
40 దేశాల్లో అజ్ఞాత నెట్‌వర్క్.. ప్రస్తుతం ఈ ఏఎల్ఎఫ్ కు సుమారు 40 దేశాలలో శాఖలు ఉన్నాయంటేనే దీని తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. అయితే వీరందరికీ ఒకే ఒక లీడర్ కానీ ఒకే ఒక నియమావళి కానీ ఉండదు. ఇది ఒక వికేంద్రీకరణ (Decentralized) పద్ధతిలో వర్క్ చేస్తుంది. ఏ దేశంలో ఉన్న సభ్యులు ఆ దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా సొంతంగా వారివారి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపడతారు. అంతేకాదు వీరంతా ఒకరికొకరు తెలియకుండానే తమ లక్ష్యం కోసం పనిచేస్తుంటారు.
ఏదైనా పెద్ద ఫార్మా కంపెనీల ల్యాబరేటరీల్లో కుక్కలను బంధించి వాటిపై ప్రయోగాలు చేస్తున్నారని వీరికి చిన్న సమాచారం అందితే చాలు.. ఏఎల్ఎఫ్ సభ్యులు వెంటనే రంగంలోకి దిగుతారు. అచ్చం తీవ్రవాదుల తరహాలోనే ముఖానికి నల్లటి మాస్కులు వేసుకుని, ప్రాణాలకు తెగించి ఆ ల్యాబ్‌లలోకి సీక్రెట్‌గా ప్రవేశిస్తారు. ఎలాగోలా అక్కడ బందీలుగా ఉన్న కుక్కలను విడిపించి తీసుకువెళ్లిపోతారు.చాలామంది దొంగలు వచ్చి కుక్కలను తీసుకెళ్లిపోయారని అనుకుంటారు.

వీరు అలా విడిపించిన కుక్క(Dogs)లకు పూర్తి షెల్టర్ కూడా కల్పిస్తారు. వాటికి కావలసిన ఆహారం, వైద్యం, సురక్షితమైన ప్రదేశాల్లో పునరావాసం కల్పిస్తారు. ఆ కుక్కలు తమ జీవితాన్ని స్వేచ్ఛగా గడిపేలా ఈ గ్రూప్ సభ్యులే అన్ని బాధ్యతలను చూసుకుంటారు.
ఈ సంస్థ సభ్యులను పట్టుకోవడానికి పోలీసులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ వీరు తమ గుర్తింపును ఎప్పుడూ బయటపెట్టరు. ఒకవేళ పొరపాటుగా పట్టుబడినా, తాము చేసింది మూగజీవాల రక్షణే కానీ, ఎలాంటి చోరీ చేయలేదని, ఎవరినీ హింసించలేదని వీరు వాదిస్తారు. ప్రాణం ఉన్న జీవాలను కాపాడటం దేశద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నిస్తుంటారు. ఇప్పటివరకు ఈ సంస్థకు చెందిన వారిని అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా నమోదు కాలేదు.
నిజానికి యానిమల్ లిబరేషన్ ఫ్రంట్ చేసే పనులు చట్టవిరుద్ధమే కావొచ్చు.. కానీ వారి ఉద్దేశం మాత్రం మూగజీవాల పట్ల ఉన్న అంతులేని ప్రేమే. ప్రయోగశాలల చీకటి గదుల్లో నలిగిపోయే మూగ జీవులకు ఏఎల్ఎఫ్ ఒక ఆశాదీపంలా కనిపిస్తుంది. అయితే కుక్క(Dogs)ల విమోచన కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక అంతర్జాతీయ ఉద్యమమే సాగుతోందని చాలామందికి తెలీదు.



