American singer Katy Perry: జస్టిన్ ట్రూడో సెకండ్ ఇన్నింగ్స్.. లవ్‌లో ఉన్నట్లు ప్రకటించిన పెర్రీ
American singer Katy Perry: తన భాగస్వామి పెర్రీలో కలిసి జపాన్ను సందర్శించారని, తమలో ఫిలిసి భోజనం చేశారని కిషేదా ఆ పోస్టులో పేర్కొన్నారు. తర్వాత జస్టిన్ ట్రూడోకూడా దీనిని రీపోస్టు చేశారు.
American singer Katy Perry
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రూడో వ్యక్తిగత అంశాలు అందరిలోనూ అటెన్షన్ పెంచుతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ(American singer Katy Perry)తో ఆయన లవ్ స్టోరీ ఇటీవల చాలా చర్చకి దారితీసింది. ఒకానొక సందర్భంలో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. అప్పటి నుంచీ వీరి వ్యవహారం బాగా వైరల్ అయింది. ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు విపరీతంగా చెక్కర్లు కొట్టాయి.
తాజాగా వార్తలు నిజమయ్యాయి. ట్రూడోతో తాను ప్రేమలో ఉన్నట్లు కేటీ పెర్రీ (American singer Katy Perry)ప్రకటించారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో బ్రూడోలో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నట్లు వెల్లడిస్తూ ఈ పోస్ట్ చేశారు. మొదటి భార్యతో ట్రూడో 2023లో విడాకులు తీసుకున్నారు. ఇటీవలే స్టీన్ ట్రూడో, కేటీ పెర్రీ జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ మాజీ ప్రధాని వ్యుమియో కిపీడాతో విందులో పాల్గొన్నారు. దీన్ని కిపీడా తన ఎక్స్ అకౌంట్ వేదికగా పోస్ట్ చేసినప్పుడు ఫోటోలను చూసి చాలా మంది వీరి లవ్ ఎఫైర్‌ను కన్ఫమ్ చేసుకున్నారు.

తన భాగస్వామి పెర్రీ(American singer Katy Perry)లో కలిసి జపాన్ను సందర్శించారని, తమలో ఫిలిసి భోజనం చేశారని కిషేదా ఆ పోస్టులో పేర్కొన్నారు. తర్వాత జస్టిన్ ట్రూడోకూడా దీనిని రీపోస్టు చేశారు. ఈ క్రమంలో సస్పెన్స్ కు ముగింపు పలుకుతూ కేటీ పెర్రి తమ రిలేషన్ గురించి స్పష్టత ఇచ్చేశారు. లోకో.. ఆన్ బూర్ అండ్ మోర్’ అంటూ క్యాప్షన్ పెట్టి జపాన్ లో జస్టిన్ ట్రూడోతో దిగిన ఫొటోను పోస్ట్ చేసారు.
జస్టిన్ ట్రూడో పదేళ్ల పాటు కెనడా ప్రధానిగా వ్యవహరించారు. ఈ ఏడాది మొదట్లో తన పదవికి రాజీనామా చేయగా.. తర్వాత జూలైలో పెర్రీతో కలిసి ఓ రెస్టారెంట్ లో కనిపించారు. అప్పట్లో ఈ ఫోటో బాగా వైరల్ అవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ఇక కొన్ని రోజుల క్రితం ఓ లగ్జరీ క్రూజ్ షిప్ లో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇక కేటీ పెర్రీ పుట్టినరోజున ప్యారిస్ లో ఓ కన్సర్ట్ కు కలిసి హాజరవడం వీరి డేటింగ్ కు మరింత బలం చేకూర్చింది. ట్రూడోకు 2005లో సోఫీ అనే ఆమెతో వివాహం జరిగింది. అయితే 15 ఏళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతూ సోఫీ బ్రూడో నుంచి విడిపోయారు.



