Just InternationalLatest News

Names in America: అమెరికాలో మీ పిల్లలకు ఇలాంటి పేర్లు పెట్టకూడదట.. ఎందుకో తెలుసా?

Names in America: ఒక బిడ్డకు పేరు పెట్టేటప్పుడు, అది ఆ బిడ్డకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించకూడదు, చట్టపరమైన చిక్కులు సృష్టించకూడదనే ఉద్దేశంతో కొన్ని పేర్లను అమెరికన్ చట్టాలు కఠినంగా నిషేధించాయి.

Names in America

సాధారణంగా అమెరికాలో జీవితం ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. అక్కడ ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను, ముఖ్యంగా పిల్లల పేర్ల(Names in America) విషయంలో, చాలా ఎక్కువగా అనుభవిస్తారు. చాలా సందర్భాలలో, మీరు మీ బిడ్డకు ఎలాంటి పేరు పెట్టాలనుకున్నా ఎవరూ ప్రశ్నించరు. ఎవరికీ నచ్చని, ఎవరూ పెట్టని విచిత్రమైన పేర్లు పెట్టుకున్నా అక్కడ చెల్లుతాయి.

అయితే, ఈ స్వేచ్ఛకు కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఒక బిడ్డకు పేరు (Names in America)పెట్టేటప్పుడు, అది ఆ బిడ్డకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించకూడదు, చట్టపరమైన చిక్కులు సృష్టించకూడదనే ఉద్దేశంతో కొన్ని పేర్లను అమెరికన్ చట్టాలు కఠినంగా నిషేధించాయి. ఈ నిబంధనలు రాష్ట్రాలను బట్టి కొద్దిగా మారొచ్చు, కానీ వాటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే.. పేరు చట్టబద్ధంగా ఉండాలి, ప్రజా సంక్షేమానికి భంగం కలిగించకూడదు.

ఎలాంటి పేర్లను నిషేధిస్తారు?.. అమెరికాలో ప్రధానంగా ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుని పేర్ల(Names in America)ను తిరస్కరిస్తారు..లేదా నిషేధిస్తారు.

అశ్లీలత లేదా అభ్యంతరకరమైన పదాలు (Obscenities).. ఏ (Names in America)పేరు అయినా బూతులుగా, అవమానకరంగా లేదా సమాజంలో అభ్యంతరకరంగా అనిపించే పదాలను కలిగి ఉంటే, ఆ పేరును రిజిస్టర్ చేయడానికి అధికారులు నిరాకరిస్తారు. బిడ్డ హక్కులను, గౌరవాన్ని పరిరక్షించడం దీని ముఖ్య ఉద్దేశం.

అంకెలు లేదా చిహ్నాలు (Numbers or Symbols).. పిల్లలకు ‘జాన్ 3’ లేదా ‘మేరీ $10’ లాంటి పేర్లు పెట్టలేరు. అలాగే, “@” లేదా “!” వంటి ప్రత్యేక గుర్తులను పేరులో ఉపయోగించడానికి అనుమతి లేదు. పేరులో సాధారణంగా ఆంగ్ల అక్షరాలు (A-Z) మాత్రమే ఉండాలి. కొన్ని రాష్ట్రాలు నామకరణంలో యాక్సెంట్ గుర్తులను (á, ñ వంటివి) లేదా హైఫెన్‌లను (-) అనుమతిస్తాయి.

Names in America
Names in America

ప్రభుత్వ లేదా అధికారిక పదాలు (Official Titles):  ఒక వ్యక్తి పేరును టైటిల్‌గా ఉపయోగించడానికి అనుమతి లేదు. ఉదాహరణకు, ‘కింగ్’ (King), ‘క్వీన్’ (Queen), ‘ప్రెసిడెంట్’ (President), ‘జడ్జ్’ (Judge), ‘సర్’ (Sir) వంటి పదాలను పేరులో భాగంగా రిజిస్టర్ చేయలేరు. ఎందుకంటే ఈ టైటిల్స్ భవిష్యత్తులో చట్టపరమైన గందరగోళానికి లేదా దుర్వినియోగానికి దారితీయోచ్చు.

ఎక్కువ పొడవు లేదా పత్రాల సమస్యలు (Excessive Length).. కొన్ని రాష్ట్రాల్లో పేరులో ఉండాల్సిన గరిష్ట అక్షరాల సంఖ్యపై పరిమితి ఉంటుంది. పేరు చాలా పెద్దదిగా ఉంటే, అది చట్టపరమైన పత్రాలు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) , కంప్యూటర్ సిస్టమ్స్‌లో నమోదు చేయడానికి సమస్యగా మారుతుంది.

మొదటి పేరుగా ఇంటి పేరు (Surname as a First Name).. కొన్ని రాష్ట్రాలలో, మీరు మీ ఇంటిపేరునే (Surname) మీ బిడ్డకు మొదటి పేరుగా (First Name) పెట్టడానికి అనుమతించరు. ఇది రికార్డులలో గందరగోళాన్ని సృష్టించకుండా ఉండటానికి తీసుకున్న నిబంధన.

ఈ నియమాల కారణంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో గతంలో తిరస్కరించబడిన లేదా నిషేధించబడిన కొన్ని ఆసక్తికరమైన పేర్ల లిస్ట్ చూస్తే..

King (కింగ్) , Queen (క్వీన్), Jesus Christ (జీసస్ క్రైస్ట్),Santa Claus (శాంటా క్లాజ్), III (మూడో) లేదా 2 (సంఖ్యలు) వంటి రోమన్ అంకెలు, సాధారణ సంఖ్యలు, @ (ఎట్ ది రేట్) లేదా & (యాండ్) వంటి గుర్తులను పేర్లుగా పెట్టకూడదు. Messiah (మెస్సయ్యా) – కొన్ని రాష్ట్రాలలో వివాదాస్పదంగా భావించి నిషేధించారు. Adolf Hitler (అడాల్ఫ్ హిట్లర్) వంటి చారిత్రక లేదా వివాదాస్పద వ్యక్తుల పేర్లు, (అండర్‌స్కోర్) వంటి నాన్-ఆల్ఫాబెటిక్ చిహ్నాల పేర్లు సెలక్ట్ చేయకూడదు..

చూశారుగా, అమెరికాలో పూర్తి స్వేచ్ఛ ఉన్నా కూడా, ఒక బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, రికార్డులు స్పష్టంగా ఉండాలి అనే లక్ష్యంతో ఈ కొన్ని పరిమితులు పాటించక తప్పదు. ఒక వ్యక్తి గుర్తింపు సమస్యలు లేకుండా ఉండేందుకే ఈ చట్టాలు ఉద్దేశించబడ్డాయి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button