Children: పిల్లలను స్కూల్‌కి పంపడంలో మీరూ ఇబ్బంది పడుతున్నారా? నిపుణులు చెప్పే సలహా ఇదే..
Children:పిల్లలకు ఉదయం లేవడం, బ్రష్ చేయడం, రెడీ కావడం వంటి ప్రతి చిన్న పనిలోనూ వారినుంచి సవాల్ ఎదురవుతుంది.

Children
పిల్లల*Children)ను బడికి పంపించే ఉదయపు వేళ… అది కేవలం కొన్ని గంటల పని కాదు, అది ఒక “మారథాన్ పరుగుపందెం”తో సమానమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తల్లులు ఈ ప్రక్రియలో విపరీతమైన హడావిడి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమను ఎదుర్కొంటున్నారని వారు చెబుతున్నారు. నోరు నొప్పెట్టేలా పదే పదే అరవడం, బట్టలు వేసుకోమని చెప్పడం, స్కూల్ బ్యాగును సిద్ధం చేయడం, సరైన సమయానికి బస్సు అందుకోవడానికి పడే ఆందోళన… ఇవన్నీ తల్లులు ప్రతిరోజూ పడే అత్యంత క్లిష్టమైన అభ్యాసమని మానసిక నిపుణులు వివరిస్తున్నారు.
పిల్లల(Children)కు ఉదయం లేవడం, బ్రష్ చేయడం, రెడీ కావడం వంటి ప్రతి చిన్న పనిలోనూ వారినుంచి సవాల్ ఎదురవుతుంది. దీనికి తోడు సమయానికి స్కూల్ బస్సు వచ్చే ఒత్తిడి, టిఫిన్, వాటర్ బాటిల్, హోంవర్క్ చెక్ చేయడం వంటి పనులు తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఈ రోజువారీ గందరగోళాన్ని అమెరికన్ ప్రొఫెసర్ ఓలాన్ విచ్ తన కథనంలో “ఒక మారథాన్‌లో దెబ్బ తగిలినంత శక్తి ఖర్చవుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, పిల్లల(Children)ను స్కూల్‌కి పంపించే ఈ సాంప్రదాయం ద్వారా శరీరానికి దాదాపు 3,000 క్యాలరీల శక్తి ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ శారీరక, మానసిక శ్రమను తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.

- డైలీ షెడ్యూల్ ముఖ్యం.. పిల్లలకు ఉదయం లేవడం నుండి బడికి వెళ్లే వరకు ఫిక్స్డ్ రొటీన్ పెట్టడం వలన వారు మానసికంగా ప్రిపేర్ అవుతారు. సమయానికి పనులు పూర్తి చేసే అలవాటు పెరుగుతుంది.
- ప్రోత్సాహక వాతావరణం.. ఉదయాన్నే చిరాకు పడటం లేదా గట్టిగా అరవడం కాకుండా, పిల్లలను ప్రతి చిన్న ప్రయత్నానికీ మెచ్చుకోవడం, ప్రోత్సాహం ఇవ్వడం మంచి పద్ధతి.
- చిన్న దశలుగా పనులు విడగొట్టడ.. ఉదయం పనులన్నింటినీ చిన్న చిన్న దశలుగా విభజించి, ప్రతిదానికీ ఒక జాబితా పెట్టడం వల్ల పిల్లలకు, ముఖ్యంగా తల్లులకు హడావిడి తగ్గుతుంది.
- సహనం, ప్రశాంతత.. మనసులో గడువు పెట్టుకోకుండా, పిల్లలు తమ పనులను నెమ్మదిగా పూర్తి చేయడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండాలి.
- తల్లుల కోసం స్వీయ సంరక్షణ.. తల్లులు కేవలం పిల్లల కోసమే కాకుండా, తమ కోసం కూడా చిన్న విరామం తీసుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
- రాత్రివేళ సిద్ధం చేయండి.. స్కూల్‌కి అవసరమైన వస్తువులైన బ్యాగు, బట్టలు, బూట్లు, పుస్తకాలను ముందే రాత్రి సిద్ధం చేసుకోవడం ద్వారా ఉదయం ఒత్తిడి తగ్గుతుంది.
- రివార్డ్స్, ఫన్ టైమ్.. వారానికోసారి “ఫన్” టైమ్ లేదా రివార్డులు ఉంటాయని పిల్లల్లో ఆసక్తిని పెంచడం ద్వారా వారు ఉదయం పనులను త్వరగా పూర్తి చేస్తారు.
- పనిలో భాగస్వామ్యం.. పిల్లలకు వారి పనిలో బాధ్యతను ఒప్పజెప్పడం (ఉదా: వారి బ్యాగు వారే సర్దుకోవడం) వారి కోపాన్ని తగ్గించి, వారిలో భాగస్వామ్యాన్ని పెంచుతుంది.
- టైమర్ ప్రాక్టీస్.. బట్టలు వేసుకోవడం వంటి పనుల కోసం చిన్న ఆటలు లేదా టైమర్ ప్రాక్టీస్ పెట్టడం వల్ల పిల్లలు సరదాగా పని పూర్తి చేస్తారు.
- సహాయం తీసుకోవడం..పిల్లలను స్కూలుకు పంపడం తల్లి బాధ్యత అని అనుకోకుండా తల్లిదండ్రులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా రోజువారీ హడావిడిని చాలా వరకు తగ్గించవచ్చు.
తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి చిన్న పనిలో పూర్తిస్థాయి సహాయం కోరే బదులు, వారికి ఆ పనిలో బాధ్యతను అప్పగించాలి. ప్రోత్సాహం ద్వారా వారిలో స్వీయ నియంత్రణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. మెరుగైన ఉదయపు రొటీన్ మొత్తం కుటుంబానికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ చిన్న జీవిత మార్పులు తల్లిదండ్రులకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి.