Mental Health: యాంబిషన్ వర్సెస్ మెంటల్ హెల్త్..యువత గెలుస్తుందా? ఓడిపోతుందా?
Mental Health:జీవితంలో ఎలా అయినా గెలవాలి అనే యువతలో కలిగిన కోరిక గెలవకపోతే నేను పనికిరాను అనే భయంగా మారిపోతుంది.
Mental Health
ఒక గోల్, ఒక యాంబిషన్… ఈ జనరేషన్ యువతలో ప్రతి ఒక్కరి మైండ్ సెట్‌లో ఇదే ఉంటుంది. కానీ, అదే ప్యాషన్ ఎప్పుడు ఒక ప్రెషర్ లా మారిందో మనకే తెలియదు. సక్సెస్ ప్రెషర్ అనే ఈ కొత్త టెన్షన్, ఈ మధ్య చాలా మంది యువతను డిప్రెషన్ వైపు తోస్తోంది. ఎందుకంటే, గెలవాలి అనే కోరిక గెలవకపోతే నేను పనికిరాను అనే భయంగా మారింది. ఈ ఆర్టికల్‌లో, ఆ ప్రెషర్‌కి కారణాలు, మన మైండ్(Mental Health) మీద దాని ఎఫెక్ట్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
మొదటగా, కుటుంబం నుంచే ఈ (Mental Health)ఒత్తిడి వస్తుంది. నువ్వు తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నా కలలను నువ్వే నెరవేర్చాలి అని తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉంచే అంచనాలు, వారికి తెలియకుండానే ఒక పెద్ద భారాన్ని మోపుతున్నాయి. ఆ తర్వాత, సమాజం. చుట్టూ ఉన్నవారు అతను ఇప్పటికే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు, నువ్వు ఏమి సాధించావు? అని చేసే పోలికలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇక, ఈ తరం యువతకు మరింత ప్రమాదకరమైనది సోషల్ మీడియా. ఇతరుల ఫోటోలలో కనిపించే పరిపూర్ణమైన జీవితాలు, వారి విజయాలు చూసి తమ జీవితం ఏమీ సాధించలేదనే భావనకు లోనై తమ విలువను తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. ఈ మూడు ప్రధాన అంశాలు కలిసి ఒక మానసిక బరువుగా మారి, యువతను నెమ్మదిగా కుంగదీస్తున్నాయి.

Mental Healthఈ ఒత్తిడి వారి మానసిక ఆరోగ్యం(Mental Health)పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సైకాలజిస్టులు దీన్ని Performance Anxiety అని పిలుస్తారు. అంటే, ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా విలువ పూర్తిగా పోతుందనే భయం. దీనివల్ల నిద్రలేమి, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఒక అధ్యయనం ప్రకారం, యువతలో నమోదైన డిప్రెషన్ కేసులలో 40 శాతానికి పైగా సక్సెస్ ప్రెషర్ కారణంగానే వస్తున్నాయి.
మన మెదడులో ఒత్తిడి పెరిగినప్పుడు “కోర్టిసాల్” (Cortisol) అనే హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే, మెదడులోని సెరోటోనిన్ (Serotonin) స్థాయిలు తగ్గిపోతాయి. సెరోటోనిన్ అనేది మన మూడ్‌ను నియంత్రించే ఒక రసాయనం.

దాని స్థాయిలు తగ్గితే, డిప్రెషన్ మరింత తీవ్రమవుతుంది. ఇది శాస్త్రీయంగా నిర్ధారించబడిన ఒక నిజం. ఈ ఒత్తిడి వల్ల చాలామంది యువత కెరీర్‌లో బ్రేక్ తీసుకోలేకపోతారు. ఒక చిన్నపాటి వైఫల్యాన్ని కూడా పెద్ద పరాజయంగా భావించి, ఫ్రెండ్స్, కుటుంబం నుంచి దూరమవుతారు. నేను విలువలేనివాడిని అనే నెగటివ్ ఆలోచనలో చిక్కుకుంటారు.
అయితే, ఈ (Mental Health)సమస్యకు పరిష్కారం అసాధ్యం కాదు. మొదటిగా, వైఫల్యాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. ఓడిపోవడం కూడా జీవితంలో ఒక భాగమని అర్థం చేసుకోవాలి. అది అంతం కాదు, కేవలం ఒక అనుభవం మాత్రమే. రెండవది, మీ మనసుకు మానసిక విరామం ఇవ్వాలి. రోజూ కొంత సమయం రిలాక్సేషన్, మైండ్‌ఫుల్‌నెస్ లేదా మెడిటేషన్ కోసం కేటాయించాలి.

మూడోది, స్వీయ విలువను గుర్తించాలి. మీ విలువను మీరు సాధించిన మార్కులు, మీ జీతం లేదా మీ పదవితో కాదు, మీలోని నైపుణ్యాలు, మీ మంచితనం, మీ వ్యక్తిత్వంతో కొలుచుకోవాలి. నాలుగవది, బలమైన సపోర్ట్ సిస్టమ్ ను ఏర్పరచుకోవాలి. కుటుంబం, స్నేహితులు ఒకరికొకరు ప్రోత్సాహం ఇవ్వాలి. పోలికలు చేయకుండా “నువ్వు ఎలా ఉన్నా మాకు విలువైనవాడివే” అని చెప్పగలగాలి. డిప్రెషన్ లోతుగా ఉంటే సైకాలజిస్టులు లేదా కౌన్సిలర్ల సలహా తీసుకోవడం ఏ మాత్రం సిగ్గుపడాల్సిన విషయం కాదు. సక్సెస్ అంటే గెలవడం కాదు, సక్సెస్ అంటే మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉండే స్థితి. యువతకు అవసరం సక్సెస్ ప్రెషర్ కాదు, సక్సెస్ బ్యాలెన్స్.



