Dangerous foods: ఈ 13 డేంజర్ ఫుడ్స్ మీ డైట్లో ఉంటున్నాయా? వీటిని తగ్గిస్తే గుండె, లివర్, గట్ సమస్యలు దూరం
Dangerous foods: ఆరోగ్యంగా జీవించడానికి, మీ శరీరం నుంచి విషాలను తొలగించడానికి మీ రోజువారీ డైట్ నుంచి కచ్చితంగా తొలగించాల్సిన 13 ప్రమాదకరమైన ఆహారాల గురించి అంతా తెలుసుకోవాలి.
Dangerous foods
ప్రస్తుతం మనం తినే ఆహారంపై శ్రద్ధ పెట్టడం అత్యంత అవసరం. కేవలం ఆకలి తీర్చుకోవడం కాకుండా, పోషకాలు, హార్మోన్ల సమతుల్యత, దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడే ఆహారాన్ని ఎంచుకోవాలి. మీరు ఆరోగ్యంగా జీవించడానికి, మీ శరీరం నుంచి విషాలను తొలగించడానికి మీ రోజువారీ డైట్ నుంచి కచ్చితంగా తొలగించాల్సిన 13 ప్రమాదకరమైన ఆహారాల (Dangerous foods)గురించి అంతా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
1. మోడర్న్ గోధుమ (Processed Wheat): ఇప్పటి గోధుమలు అధికంగా ప్రాసెస్ చేయబడుతున్నాయి. వీటిలో గ్లూటెన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇవి గట్ (జీర్ణవ్యవస్థ) సమస్యలు, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్కు ప్రధాన కారణం. అంతేకాక, ఇది రక్తంలో షుగర్ లెవెల్స్‌ను (Blood Sugar) వేగంగా పెంచుతుంది, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది.
2. వివాదాస్పద సోయా (Soy): మార్కెట్లో లభించే చాలా వరకు సోయా ఉత్పత్తులు GMO (జన్యుపరంగా మార్పు చేసినవి) , అధిక స్థాయిలో రసాయన స్ప్రేలతో కూడుకున్నవి. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.
3. ప్రమాదకర(Dangerous foods) మార్జరిన్ (Margarine): వెన్నకు ప్రత్యామ్నాయంగా వాడే మార్జరిన్, కృత్రిమమైన ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది. ఇది గుండె, ధమనులు (ఆర్టరీస్) మరియు జీవక్రియ (మెటబాలిజం) ఆరోగ్యానికి అత్యంత హానికరం. దీనికి బదులుగా నాణ్యమైన వెన్న (Butter) లేదా నెయ్యి (Ghee) ఉపయోగించడం శ్రేయస్కరం.
4. గ్యాస్ పానీయాలు (Carbonated Drinks): ఇవి కేవలం షుగర్ బాంబులు లేదా కృత్రిమ రసాయనాల కాక్టెయిల్స్ మాత్రమే. వీటిని తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అమాంతం పెరిగి, లివర్‌పై ఒత్తిడి పడుతుంది, అలాగే కడుపులోని మంచి బ్యాక్టీరియా (Gut Bacteria) పాడవుతుంది.

5. ఫైబర్ లేని ఫ్రూట్ జ్యూస్: పండ్ల రసాలు పూర్తిగా కన్సన్ట్రేటెడ్ షుగర్‌తో నిండి ఉంటాయి. పండులో ఉండే ఫైబర్‌ను తొలగించడం వల్ల, ఇది నేరుగా బ్లడ్ షుగర్‌పై విపరీతమైన ప్రభావాన్ని చూపి, ఫ్యాట్ స్టోరేజ్‌ను పెంచుతుంది. పండును పూర్తిగా తినడమే ఉత్తమం.
6. ఎనర్జీ డ్రింక్స్ (Energy Drinks): ఇవి అధిక కాఫీన్, అధిక షుగర్, కృత్రిమ రసాయనాల కలయిక. వీటిని తరచుగా తీసుకోవడం గుండె, లివర్ మరియు అడ్రినల్ గ్రంథులపై (Adrenals) అధిక ఒత్తిడిని పెంచుతుంది.
7. రిఫైన్డ్ కార్బ్స్ (Refined Carbs-Dangerous foods ): వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, ప్రాసెస్ చేసిన సీరియల్స్ వంటివి పోషకాలు లేని కార్బోహైడ్రేట్లు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా అధికంగా ఉండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ , బరువు పెరగడానికి కారణమవుతాయి.
8. చీప్ కాఫీ , క్రీమర్స్: తక్కువ-నాణ్యత గల కాఫీలో అచ్చు (Mold) ఉండే అవకాశం ఉంటుంది. అతిగా రోస్ట్ చేయడం వల్ల రుచి కోల్పోతుంది. దీనికి అదనంగా షుగర్, కృత్రిమ క్రీమర్లు జోడించడం వల్ల నష్టం ఎక్కువ, ప్రయోజనం తక్కువ.
9. ఇన్ఫ్లమేటరీ సీడ్ ఆయిల్స్ (Seed Oils): కానోలా, వెజిటెబుల్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి సీడ్ ఆయిల్స్‌లో ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి వేడి చేసినప్పుడు త్వరగా ఆక్సిడైజ్ అయ్యి, శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, గుండె జబ్బుల రిస్క్‌ను పెంచుతాయి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, నెయ్యి మంచి ప్రత్యామ్నాయాలు.
10. ఫ్లేవర్డ్ యోగర్ట్స్ & లో-ఫ్యాట్ స్నాక్స్(Dangerous foods): వీటిని ‘హెల్దీ’ అని ప్రచారం చేసినా, వీటిలో దాగి ఉన్న షుగర్ (Hidden Sugars), రసాయనాలు, మందపాటి (Thickening) కోసం వాడే కెమికల్స్ ఉంటాయి. లో-ఫ్యాట్ అంటే, రుచి కోసం షుగర్‌ను ఎక్కువగా కలుపుతారని గుర్తుంచుకోండి.

11. పాలిష్డ్ రైస్ / తెల్ల బియ్యం (Polished Rice): ఈ ప్రాసెస్‌లో బియ్యం నుండి పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, పోషకాలు తొలగిపోతాయి. ఫలితంగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉండి, బ్లడ్ షుగర్‌ను వేగంగా పెంచుతుంది. బ్రౌన్ రైస్‌లో కూడా కార్బ్ శాతం ఎక్కువే కాబట్టి, దానిని కూడా మధ్యస్థ స్థాయిలో మాత్రమే తీసుకోవాలి.
12. మైదా (Maida / Refined Flour): పూర్తిగా రిఫైన్ చేయబడిన మైదాలో ఫైబర్, పోషకాలు అసలు ఉండవు. ఇది ఇన్సులిన్ స్థాయిని మూడు రెట్లు పెంచి, బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం), కొవ్వు నిల్వ, గట్ సమస్యలకు ప్రధాన కారణం.
13. ప్రాసెస్(Dangerous foods) చేసిన పిండి పదార్థాలు (Refined Flours in Snacks): పరాటాలు, పూరీలు, బేకరీ ఐటమ్స్ (పఫ్స్, కేక్స్), బిస్కట్లు వంటివి అధిక కార్బ్, అధిక ఫ్యాట్, ఎమల్సిఫైయర్‌ల కలయిక. ఇవి గట్ డ్యామేజ్‌కు గురిచేసి, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.
మీరు ఈ 13 ఆహారాలను తొలగిస్తే, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మెరుగైన మెటబాలిజం (జీవక్రియ).. మీ శరీరం సమర్థవంతంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
- హార్మోన్ల సమతుల్యత.. మానసిక స్థితి మెరుగుపడుతుంది.
- ఎనర్జీ స్థాయిలు.. రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు.
- ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింపు.. మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- దీర్ఘకాలిక వ్యాధుల నివారణ.. గుండె జబ్బులు, ఇన్ఫ్లమేటరీ సమస్యలు దూరమవుతాయి.



