Babycorn :బేబీకార్న్.. ఆరోగ్యానికి కొత్త చిరునామా
Babycorn : బేబీకార్న్ రోజూ తింటే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

Babycorn
బేబీకార్న్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్స్. వీటిని ఈవెనింగ్ స్నాక్స్ గానే కాకుండా, రోటీలు, గారెలు, శాండ్విచ్లు, కర్రీస్, ఫ్రైస్ లో కూడా విరివిగా వాడుతుంటారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సాధారణ మొక్కజొన్న రకాల కన్నా బేబీకార్న్‌లో కేలరీలు తక్కువ. ఇందులో కొవ్వు ఉండదు, విటమిన్ ఎ, బి, సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.

బేబీకార్న్రోజూ తింటే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మంలోని డెడ్ సెల్స్‌ను రిపేర్ చేసి, చర్మానికి కొత్త నిగారింపును ఇస్తుంది. బేబీకార్న్‌లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.

గర్భిణులు తింటే శిశువులో ఎదుగుదల లోపాలు తలెత్తవు. వీటితోపాటుగా రోజుకు అవసరమైన జింక్, ఐరన్, కాల్షియం కూడా శరీరానికి అందుతాయి. వీటిని సూప్‌లు, సలాడ్లు, చైనీస్ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన రుచిని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
2 Comments