Coffee: రోజూ కాఫీ తాగడం లాభమా? నష్టమా? తాగితే ఎప్పుడు తాగాలి? ఎలా తాగాలి?
Coffee: కాఫీలో ఉండే ప్రధాన క్రియాశీలక పదార్ధం కెఫిన్ (Caffeine). ఇది శరీరంలో శక్తిని పెంచడంలో, చురుకుదనాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Coffee
కాఫీ (Coffee)ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగకపోతే రోజు గడవనట్లు ఉంటుంది. అయితే, కాఫీని తాగే విధానం, సమయంపై దాని లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి.
కాఫీ(Coffee)లో ఉండే ప్రధాన క్రియాశీలక పదార్ధం కెఫిన్ (Caffeine). ఇది శరీరంలో శక్తిని పెంచడంలో, చురుకుదనాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కెఫిన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 20 నిమిషాలకు పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపించి, వెంటనే చురుకుదనాన్ని పెంచుతుంది.
కాఫీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్‌గా తయారవుతుంది, అంతేకాకుండా దాని వలన మూడ్ సెట్ అవుతుంది. ఇది ఒక మూడ్ సెట్టింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. డల్‌గా ఉన్నప్పుడు చిన్న కప్పు కాఫీ తాగినా కూడా మూడ్ సెట్ అయ్యి, ఉత్సాహంగా మారుతుంది.

చాలా మందికి తిన్న తర్వాత ఎక్కువగా నిద్ర వస్తుంటుంది. ఈ నిద్ర (Food Coma)ను తగ్గించుకోవడానికి మధ్యాహ్నం కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని వైద్యులు అంటున్నారు. ఇది దృష్టిని కేంద్రీకరించడంలో కూడా సహాయపడుతుంది.
కాఫీ తాగేటప్పుడు పాటించాల్సిన నియమాలు (నష్టాలు నివారించడానికి)..
కాఫీ ఆరోగ్యకరమైన పానీయం అయినా కూడా.. కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు , పోషక శోషణలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
కాఫీతో ద్రాక్షపండు, నారింజ వంటి సిట్రస్ పండ్లను కలపకూడదు. అలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం (Acidity) పెరుగుతుంది, ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
మీరు ఎప్పుడైనా రెడ్ మీట్ తింటే, పొరపాటున కూడా వెంటనే కాఫీ తాగకూడదు. దీనివల్ల మాంసం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా, ఐరన్ (Iron) శోషణలో కూడా సమస్యలు వస్తాయి.
చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, పోషకాహార నిపుణులు చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని సిఫార్సు చేస్తున్నారు.
కాఫీ రోజువారీ జీవితంలో శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, దాన్ని మితంగా, సరైన సమయంలో తీసుకోవాలి. బ్లాక్ కాఫీని ఎంచుకోవడం ద్వారా పాలలోని కొవ్వులు, చక్కెర వల్ల వచ్చే నష్టాలను నివారించొచ్చని నిపుణులు చెబుతున్నారు.



