Mishri: షుగర్ కంటే పటికబెల్లం మంచిది.. దీని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Mishri: పంచదారను ప్రాసెస్ చేసేందుకు ముందు ఉండే సహజ రూపమే ఈ పటికబెల్లం. దీనిని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Mishri
సాధారణంగా మనం వాడే పంచదార కంటే పటికబెల్లం (Mishri) ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. పటికబెల్లంనే కలకండ అని కూడా పిలుస్తారు. నిజానికి, పంచదారను ప్రాసెస్ చేసేందుకు ముందు ఉండే సహజ రూపమే ఈ పటికబెల్లం. దీనిని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పటికబెల్లం యొక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:
గొంతు సమస్యలకు పరిష్కారం.. స్వరపేటికను ఎక్కువగా ఉపయోగించే వారికి (పాటలు పాడేవారు, ఉపాధ్యాయులు, వక్తలు) తరచుగా గొంతు బొంగురుపోవడం సమస్యగా ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి, వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రోజూ తాగితే, వీలయితే రోజుకు రెండు సార్లు తాగితే గొంతు బొంగురు తగ్గుముఖం పడుతుంది.
హిమోగ్లోబిన్ పెరుగుదల.. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు లేదా అనీమియా (Anemia) సమస్యతో బాధపడుతున్నప్పుడు, రక్తంలో హిమోగ్లోబిన్ (Hemoglobin) స్థాయిని పెంచడానికి పటికబెల్లం చాలా ఉపయోగపడుతుంది.

జీర్ణ సమస్యలకు ఉపశమనం.. నీళ్ల విరేచనాల (Diarrhea) వంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది.
దగ్గు, జలుబు నివారణ.. పటికబెల్లం పొడిని, పసుపు పొడిని కలిపి నిప్పుల మీద వేసి, దాని వాసనను రోజుకు రెండు పూటలా పీలుస్తూ ఉంటే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
వడదెబ్బ నుంచి రక్షణ.. ఎండాకాలంలో పటికబెల్లం పొడిని నీటిలో వేసుకుని తాగితే, శరీరంలో అతి దాహం తగ్గడంతో పాటు, వేడిని తగ్గించి వడదెబ్బ (Heat Stroke) తగలకుండా కాపాడుతుంది.
నోటి, దంతాల ఆరోగ్యం.. పటికబెల్లాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా, దంతాలు , చిగుళ్ల సమస్యలు కూడా తగ్గి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పటికబెల్లం సహజమైన తీపి , ఔషధ గుణాలు కలగలిపిన పదార్థం. అందుకే పంచదారకు బదులు దీనిని తీసుకోవడం ద్వారా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.