Moringa: మునగాకు కాదు అది..పోషకాల పవర్‌హౌస్
Moringa: మునగాకులను పెద్దగా లెక్కలోకి తీసుకోని మనకు, ప్రపంచం మొత్తం మునగను "సూపర్‌ఫుడ్" అని పిలుస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతాం.

Moringa
మనం సాధారణంగా పలకరిస్తున్నాం కానీ పూర్తిగా పట్టించుకోని ఒక అద్భుతం మన పెరట్లోనే ఉంది. అదే మునగాకు! సాంబారులోకి మునక్కాడలు తప్ప, ఆకులను పెద్దగా లెక్కలోకి తీసుకోని మనకు, ప్రపంచం మొత్తం మునగను “సూపర్‌ఫుడ్” అని పిలుస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఏదో “బతికుంటే బలుసాకు తినొచ్చు” అని అంటుంటే.. మునగాకు మాత్రం “రోజూ నన్ను తింటే వందేళ్లు బతకొచ్చు” అని అంటోంది.
ఆఫ్రికా లాంటి దేశాలు మునగను ఒక పోషకాల కల్పవృక్షంగా భావిస్తాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు మునగాకు పొడిని మందుల మాదిరిగా ఇస్తున్నారు. ఎందుకంటే, దీనిలో ప్రపంచంలో మరే ఆహారంలోనూ లేనంతగా పోషకాలు నిండి ఉన్నాయి.
Free mobile:వారికి ఫ్రీగా మొబైల్ ఫోన్లు ..ఎక్కడ? ఎలా అప్లై చేయాలి?
మునగా(Moringa)కు శక్తిని కొలవడానికి కొన్ని పోలికలు చూద్దాం. వంద గ్రాముల మునగాకులో:
- విటమిన్-సి: నారింజలో కంటే 7 రెట్లు ఎక్కువ! ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- కాల్షియం: పాల కంటే 4 రెట్లు ఎక్కువ. ఎముకలకు చాలా మంచిది.
- పొటాషియం: అరటిపండ్లలో కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
- ఐరన్: పాలకూరలో కంటే 3 రెట్లు ఎక్కువ. రక్తహీనతను నివారిస్తుంది.
- విటమిన్-ఇ: బాదంలో కంటే 3 రెట్లు ఎక్కువ. చర్మం, జుట్టు ఆరోగ్యానికి అవసరం.
- ప్రొటీన్లు: పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ. కండరాల నిర్మాణానికి కీలకం.
ఇవి మాత్రమే కాదు, మునగాకులో 96 రకాల పోషకాలు, ముఖ్యంగా ఒమేగా-3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్, అన్ని రకాల అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నిజంగా ప్రకృతి అందించిన ఒక పవర్‌హౌస్.

కొంతకాలం క్రితం వరకు మనం పట్టించుకోని ఈ చెట్టుని, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆరాధిస్తోంది. అమెరికాకు చెందిన ‘ద ట్రీస్ ఫర్ లైఫ్’ స్వచ్ఛంద సంస్థ మునగ అద్భుతాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఎన్నో వ్యాధులను నయం చేయగల శక్తి దీనిలో ఉందని నిరూపించింది. ఐక్యరాజ్యసమితి సైతం మునగ ప్రాముఖ్యతను గుర్తించి, దాని పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది.
మునగను “నెక్స్ట్ క్వినోవా”గా చెబుతారంటేనే దీని విలువ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో ఎండిన మునగాకు పొడిని స్మూతీలు, సలాడ్‌లు, టీ రూపంలో తీసుకుంటున్నారు. ఎందుకంటే, పొడి రూపంలో పోషకాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే, మనకు తాజా ఆకు దొరుకుతుంది కాబట్టి, దానిని నేరుగా ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.