Periods:పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి..ఈ చిట్కాలతో రిలీఫ్..!
Periods: పీరియడ్స్ సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, డార్క్ చాక్లెట్ లేదా బాదం పప్పులు తీసుకోవడం మంచిది.
Periods
మహిళల ఆరోగ్య విషయంలో పీరియడ్స్(Periods) అనేది చాలా సహజమైన ప్రక్రియ అయినా సరే, ఆ సమయంలో వచ్చే నడుము నొప్పి , కడుపు నొప్పి చాలా మందిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి.ఈ నొప్పిని భరించలేక ఈ సమయంలో చాలా మంది వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడేస్తుంటారు. అయితే వాటి వల్ల భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోవడం ముఖ్యం.
ముందుగా వాము ( ఓమ) నీళ్లు పీరియడ్(Periods) పెయిన్ తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వాము వేసి బాగా మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా తాగడం వల్ల గర్భాశయ కండరాలు రిలాక్సవుతాయి. దీనివల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అలాగే అల్లం టీ కూడా ఈ సమయంలో చాలా మంచిది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో కలిగే వాపును, నొప్పిని తగ్గిస్తాయి. వేడి నీటి బ్యాగ్ తో నడుము మీద , పొత్తికడుపు మీద కాపడం పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి కండరాలు పట్టేయడం తగ్గుతుంది.

అంతేకాదు ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెయిన్ ఎక్కువ ఉందని చాలామంది ఆ సమయంలో తినడం మానేస్తారు. కానీ తినకపోతే ఇంకా పెయిన్ ఎక్కువవుతుంది. పీరియడ్స్ సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, డార్క్ చాక్లెట్ లేదా బాదం పప్పులు తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండంటంతో పాటు మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి.
అలాగే కాఫీ , టీ వంటి కెఫీన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇవి కడుపులో గ్యాస్ ను పెంచి నొప్పిని ఎక్కువ చేస్తాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు తేలికపాటి యోగాసనాలు వేయడం వల్ల పీరియడ్స్ కష్టాలను ఈజీగా దాటొచ్చు.



