Women: మహిళలకు మీసాలు, గడ్డాలు ఎందుకు పెరుగుతాయి? సైన్స్ చెప్పే నిజాలు
Women: మహిళలకు ముఖంపై వెంట్రుకలు పెరగడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

Women
సాధారణంగా గడ్డాలు, మీసాలు పురుషులకు మాత్రమే వస్తాయి. కానీ, కొందరు మహిళలకు కూడా ఇవి రావడం మనం చూస్తూ ఉంటాం. ఈ సమస్య వారికి మానసికంగా చాలా ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తుంది. వారు నలుగురిలోకి వెళ్లడానికి కూడా భయపడతారు.
మహిళల(Women)కు ముఖంపై వెంట్రుకలు పెరగడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిని జెనెటిక్ హైపర్‌ట్రైకోసిస్ అని అంటారు. ఇందులో వెంట్రుకలు ఎక్కువగా, అసాధారణంగా పెరుగుతాయి.
హార్మోన్ల అసమతుల్యత చాలా సాధారణమైన కారణం. పురుషులలో ఉండే ఆండ్రోజెన్ అనే హార్మోన్ మహిళల శరీరంలో ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ పరిస్థితిని హిర్సుటిజమ్ అని అంటారు. ఇది తరచుగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS) వంటి ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. PCOS ఉన్న మహిళల్లో ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం మరియు అసాధారణమైన హార్మోన్ల ఉత్పత్తి కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.
ఈ రెండు కారణాలు కాకుండా, కొన్ని మందుల వాడకం, లేదా కొన్ని అరుదైన వ్యాధుల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడొచ్చు. ఈ సమస్యకు వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్య హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తే, బరువు తగ్గడం ద్వారా ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయిని 40 నుంచి 50 శాతం వరకు తగ్గించొచ్చు.

పురుష హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడానికి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. వైద్య నిపుణుల సలహాతో ఈ మందులు వాడటం వల్ల వెంట్రుకల పెరుగుదలను నియంత్రించవచ్చు. వెంట్రుకలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించుకోవడానికి కొన్ని కాస్మెటిక్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
లేజర్ ట్రీట్‌మెంట్.. చుట్టుపక్కల చర్మానికి ఎలాంటి హాని కలగకుండా వెంట్రుకలను తొలగించే ఒక సురక్షితమైన పద్ధతి.
ఎలెక్ట్రోలైసిస్.. ఇది వెంట్రుకలను శాశ్వతంగా తొలగించే పద్ధతి. అయితే, దీనివల్ల చర్మం సహజ పిగ్మెంటేషన్‌ను కోల్పోయే అవకాశం ఉంది.
మహిళల(Women)కు ఈ సమస్య వచ్చినప్పుడు దానిని దాచుకోవడం కంటే, ఒక వైద్య నిపుణుడిని సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల వారు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు.
Anushka: ఘాటితో కమ్ బ్యాక్: యాక్షన్ డోస్ పెంచిన జేజమ్మ.!