Just LifestyleHealthLatest News

Self Love:నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్వార్థం కాదు.. అదొక అవసరం..ఎందుకంటే?

Self Love : చాలామంది సెల్ఫ్ లవ్ అంటే అదేదో స్వార్థపరులకు మాత్రమే సంబంధించింది అనుకుంటారు.

Self Love

మనలో చాలామంది తన చుట్టూ ఉన్నవాళ్లను, కుటుంబసభ్యులను సంతోషపెట్టాలని తాపత్రయపడుతుంటాము. కుటుంబం కోసం, స్నేహితుల కోసం, ఆఫీసు బాధ్యతలలో పడి తమను తాము కరిగించుకుంటాము. ఇదే అలవాటుగా మారి తమను ప్రేమించుకోవడం (Self Love) పూర్తిగా మర్చిపోతుంటాము.

సైకాలజీ ప్రకారం, ఎవరైతే తమను తాము ప్రేమించుకోలేకపోతున్నారో, వారు ఇతరులకు నిజమైన ప్రేమను కూడా పంచలేరట. అది ఫ్రెండ్స్, చుట్టాలు, మనసుకు నచ్చినవాళ్ల విషయంలోనే కాదు చివరకు కడుపున పుట్టిన పిల్లలు అయినా, జీవిత భాగస్వామి అయినా,కన్న తల్లిదండ్రులు అయినా సరే వారికి పరిపూర్ణమైన ప్రేమను అందించలేరట.

అంతేకాదు ఇంకొన్నిసార్లు వాళ్లు ప్రేమించలేదు.. వీళ్లు ఇష్టపడలేదు అని బాధపడతాం తప్ప నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతే వేరేవాళ్లు నిన్నెందుకు ఇష్టపడాలి? నిన్నెందుకు ప్రేమించాలి అని ఒక్క క్షణం కూడా ఆలోచించం.

చాలామంది సెల్ఫ్ లవ్ (Self Love)అంటే అదేదో స్వార్థపరులకు మాత్రమే సంబంధించింది అనుకుంటారు. కానీ సెల్ఫ్ లవ్ అంటే స్వార్థం కాదు, అది మన శారీరక , మానసిక ఆరోగ్యానికి మనం ఇచ్చుకునే కనీస గౌరవం. ఒక ఖాళీ గ్లాసుతో మనం ఇతరుల దాహాన్ని ఎలా తీర్చలేమో, మన మనసు నిండా సంతోషం లేనప్పుడు ఇతరులను కూడా సంతోషంగా ఉంచలేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

మనల్ని మనం ప్రేమించుకోవడంలో ఫస్ట్ స్టెప్..స్వీకరణ (Self-Acceptance). ఈ ప్రపంచంలో ఎవరూ కూడా పర్ఫెక్ట్ అనేలా ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని శారీరకంగా అయినా మానసికంగా అయినా లోపాలు ఉంటాయి. ఎదుటివారిలోనే కాదు మనలో కూడా అవి ఉంటాయని తెలుసుకోవాలి. అలా అని వాటిని చూసి కుంగిపోకుండా, మనల్ని మనం ఎలా ఉన్నామో అలాగే అంగీకరించాలి.

అంతేకాదు ఇతరులతో మనల్ని మనం పోల్చుకుని కంపేర్ చేసుకోవడం అనేది మన సంతోషాన్ని దొంగిలిస్తుంది. సోషల్ మీడియాలో కనిపించే అందమైన ఫోటోలు, విలాసవంతమైన జీవితాలు చూసి మన జీవితం బాగోలేదని బాధపడకూడదు. తెర వెనుక ప్రతి ఒక్కరికీ వారిదైన కష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

మరీ ముఖ్యంగా ప్రతిరోజూ మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవడమనేది చాలా అవసరం. ఎప్పుడూ మన గురించి, ఇతరుల గురించి, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించే మన మెదడుకు కొంచెం విశ్రాంతినివ్వాలి.

విశ్రాంతి అంటే పడుకోవడం కాదు.. ఆ సమయంలో మీకు నచ్చిన పుస్తకం చదవడం కావొచ్చు, ఇష్టమైన సంగీతం వినడం , ఏ ఆలోచన లేకుండా మౌనంగా ప్రకృతిని చూడటం కావొచ్చు. ఈ చిన్న ‘మీ టైమ్’ (Me Time) మీలోని ఒత్తిడిని తగ్గించి, కొత్త ఎనర్జీని ఇస్తుంది. మన ఆరోగ్యం కోసం యోగా,వ్యాయామాలు, మీకు నచ్చిన హాబీలు మెరుగుపరుచుకోవడం చేయాలి.

Self Love
Self Love

అలాగే, మనల్ని మనం క్షమించుకోవడం (Self-Forgiveness) కూడా అవసరమే. గతంలో చేసిన తప్పులను, ఎదురైన చేదు అనుభవాలను పదే పదే తలచుకుంటూ కూర్చుంటే, మనం ఇప్పుడున్న జీవితాన్ని మిస్ అవుతాం. ఆ తర్వాత దీని గురించి భవిష్యత్తులో బాధపడేలా పరిస్థితులు వస్తాయి. అందుకే ఈ క్షణంలో జీవించు. తప్పుల నుంచి పాఠాలు మాత్రమే నేర్చుకుని ముందుకు సాగిపో అనేలా మనల్ని మనం మార్చుకోవాలి.

ఆత్మవిశ్వాసం (Self-Confidence) పెంచుకోవాలి. మనలోని మంచిని మనమే గుర్తించాలి అంటే.. ప్రతిరోజూ పడుకునే ముందు మనం చేసిన ఒక మంచి పనిని లేదా మనలో ఉన్న ఒక గొప్ప గుణాన్ని గుర్తుచేసుకోవాలి.

అన్నిటికంటే ముఖ్యంగా మన మనసుకు నచ్చని పనినో, లేక బాధ్యతలకో ‘నో’ (No) అని చెప్పడం నేర్చుకోవాలి. మన మానసిక ప్రశాంతతను దెబ్బతీసే వ్యక్తులకు, మన శక్తిని హరించే పనులకు దూరంగా ఉండాలి. మన లిమిట్స్‌ను మనం గౌరవించుకున్నప్పుడే కదా ఇతరులు కూడా మనల్ని గౌరవిస్తారు. అందుకే, ఇతరులను ప్రేమించే ముందు మనల్ని మనం ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవాలన్న(Self Love) విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button