Bike :మీ బైక్ మైలేజ్ ఇవ్వడంలేదా? ఈ 8 టిప్స్ మీ కోసమే..
Bike : సరైన సమయానికి బైక్‌ను సర్వీసింగ్ చేయించకపోవడం చాలా మంది చేసే పెద్ద తప్పు. రెగ్యులర్‌గా సర్వీస్ చేయించడం వల్ల ఇంజన్ సక్రమంగా పని చేసి, బైక్ కండీషన్ మెరుగుపడుతుంది.

Bike
ప్రస్తుత కాలంలో బైక్(Bike )అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతీ ఇంట్లో బైక్ లేదా స్కూటీ ఉంటోంది. అయితే, బైక్ వాడే అందరికీ ఉన్న కామన్ సమస్య ‘మైలేజ్’. బైక్ మైలేజ్ ఇవ్వడంలేదని ఫీల్ అయ్యేవారు ఈ కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటిస్తే, మైలేజీని సమర్థవంతంగా పెంచుకోవచ్చు.
Bike మైలేజ్ పెంచడానికి చేయాల్సినవి:
ఆన్ టైం సర్వీసింగ్ ముఖ్యం.. సరైన సమయానికి బైక్(Bike)ను సర్వీసింగ్ చేయించకపోవడం చాలా మంది చేసే పెద్ద తప్పు. రెగ్యులర్‌గా సర్వీస్ చేయించడం వల్ల ఇంజన్ సక్రమంగా పని చేసి, బైక్ కండీషన్ మెరుగుపడుతుంది. ఇది మైలేజీని పెంచడంతో పాటు, ఇంజన్ లైఫ్ స్పాన్‌ను కూడా పెంచుతుంది.
కార్బ్యురేటర్ చెక్ చేయించండి.. ప్రతి బైక్ మైలేజ్ కార్బ్యురేటర్ అనే పరికరంపై ఆధారపడి ఉంటుంది. మైలేజ్ తగ్గితే వెంటనే కార్బ్యురేటర్‌ను చెక్ చేయించాలి. ఇందులో చిన్న సమస్య ఉన్నా మైలేజ్ అస్సలు రాదు. ప్రతి సర్వీసింగ్‌లో కార్బ్యురేటర్ పనితీరును తప్పకుండా తనిఖీ చేయించుకోవడం ఉత్తమం.
మంచి ఇంజన్ ఆయిల్ వాడండి.. ఇంజన్ సరిగ్గా పనిచేయాలంటే మంచి కంపెనీ ఇంజన్ ఆయిల్ వాడటం తప్పనిసరి. తక్కువ ధరల కోసం నాసిరకం ఆయిల్ వాడితే, కొద్ది రోజులకే ఇంజన్ పికప్ తగ్గిపోయి, మైలేజ్ పూర్తిగా రాకుండా పోతుంది.

అదనపు పార్ట్స్ వద్దు.. బైక్ కొన్నప్పుడు వచ్చిన పార్ట్స్‌తో పాటు కొందరు ఎక్స్‌ట్రా పార్ట్స్‌ను (సైలెన్సర్, డిస్క్ బ్రేక్‌లు వంటివి) అమరుస్తుంటారు. ఇలాంటి మార్పులు చేయడం ద్వారా బైక్‌పై అదనపు భారం పడి, ఆటోమేటిక్‌గా మైలేజీ తగ్గుతుంది.
టైర్ ప్రెజర్ సరిగ్గా ఉంచుకోవాలి.. టైర్లలో ఎప్పుడూ సరైనంత గాలి (ఎయిర్ ప్రెజర్) ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా దూరం ప్రయాణం చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం. గాలి తక్కువగా ఉంటే, బైక్‌కు అధిక శక్తి అవసరమై స్పీడ్ తగ్గి, మైలేజ్ పడిపోతుంది. పెట్రోల్ నింపుకునే సమయంలోనే ఎయిర్ ప్రెజర్ తప్పకుండా చెక్ చేయించుకోవాలి.
ఎకో ఫ్రెండ్లీ స్పీడ్ పాటించాలి.. బైక్‌ను పరిమిత వేగంలో నడిపితేనే మైలేజ్ పెరుగుతుంది. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజన్ వేడెక్కి, మైలేజ్ ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది. గంటకు 45 నుంచి 50 కి.మీ మధ్యలో స్పీడ్ మెయిన్‌టేన్ చేయడం వల్ల మైలేజ్ బాగా రావడమే కాకుండా, ఇంజన్ కూడా సురక్షితంగా ఉంటుంది.
సిగ్నల్స్ దగ్గర ఇంజన్ ఆఫ్ చేయండి.. హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ ఎక్కువ ఉన్న నగరాల్లో సిగ్నల్స్ దగ్గర చాలా సేపు ఆగాల్సి వస్తుంది. ఇంజన్ ఆన్‌లో ఉన్నంత సేపు పెట్రోల్ తీసుకుంటూనే ఉంటుంది. సిగ్నల్ పడినప్పుడు వెంటనే ఇంజన్ ఆఫ్ చేయడం ద్వారా పెట్రోల్‌ను ఆదా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా నెలకు దాదాపు 10% వరకు పెట్రోల్‌ను సేవ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ స్టార్ట్ ఉన్న బైక్‌లకు ఇది చాలా సులభమైన పద్ధతి.
ఎండలో బైక్ పెట్టొద్దు.. పెట్రోల్ చాలా సులువుగా ఆవిరి అయిపోతుంది. అందుకే బైక్‌ను ఎక్కువ సేపు ఎండలో పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజన్ మీద ప్రభావం పడి మైలేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.