
Literature:
భారతీయులందరూ నా సహోదరులు
అని ప్రతిజ్ఞ చెపుతుంటే
ఉప్పొంగిన హృదయం …
ఒక్కోసారి ఉప్పెనొచ్చి మీద పడినట్లు
తల్లడిల్లి పోతుంది ..
ఒక ఢిల్లీయో, ఒక హైదరాబాదో
ఒక గ్రామ పొలిమేరో
ఒక పట్టణ శివారో
ఎక్కడైనా…. ప్రాంతమేదైనా
ఊరకుక్కల్లా కామాంధులు కాటేస్తుంటే
చట్టం భయపెట్టడం లేదు
న్యాయంలో ఉదాసీనత పోలేదు..
విచ్చలవిడి మత్తుపదార్థాలు
విశృంఖల మనస్తత్వాలు
వసంతాలను చిదిమేస్తుంటే
ఎవరి సోదరో..? ఎవరి బిడ్డనో..?
ఎవరతేనేం..?
అయ్యో! పాపం అనుకుంటూ
టీవీ ముందు కంచం పట్టుకొని కూర్చుని
అన్నంతో పాటు ఆవేదనను
దిగమింగేస్తున్నాం..
ఇంక్రెడిబుల్ ఇండియా అంటూ
మనల్ని మనమే పొగిడేసుకుంటున్నాం..
“విశ్వగురువు” అనే బిరుదు కట్టుకుంటూ
స్వయం భ్రమలో మునిగిపోతున్నాం..
మహిళా సాధికారతలో
ముందున్నామంటూ మనల్ని మనమే
పొగిడేసుకుంటున్నాం..
అభివృద్ధి అంటే
తలో కారు కొనుక్కోవడమో..
తలసరి ఆదాయం పెరగడమో కాదు..
ప్రతి తలలోనూ సంస్కారం నింపడమే ..!
మన పురాణాలలో మన చరిత్రలో
అత్యాచారం అనే పదం
మచ్చుకైనా కనిపించదే..
ధుర్యోధన,దుశ్శాసనులు,
రావాణాసుర రాక్షసులు
వీళ్లకంటే నయమనిపించలేదూ..
ఎక్కడదీ సంస్కృతి ?
ఎవరు పెంచారీ వికృతి?
మత్తు మూలాలు వదిలించకుండా
భద్రత భరోసా పెంచకుండా
శిక్షలు భయపెట్టకుండా
అధిక జనాభా ఉన్న దేశంలో
అరాచకాన్ని ఎలా ఆపగలం..?
లోపభూయిష్టమైన చట్టాల వలన
చెలరేగిపోతున్న చెత్త వెధవల
చేతికి బేడీలు వేయించలేకున్నా
రక్ష మాచల మాచల అంటూ
చెల్లీ నిన్ను రక్షిస్తామంటూ
చేతికి రాఖీలు మాత్రం
కట్టించేసుకుందాం..!
అయ్యా!
దేశ్‌కీ నేతాలు, దేశోద్ధారకులు
మీ అందరికీ
రక్షాబంధన్ శుభాకాంక్షలు..
—ఫణి మండల
వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా ఉంది.. ఒక సోదరుని గా మన బాధ్యత ఏమిటో తెలియచేసేలా రాసిన కలానికి హ్యాట్సాఫ్
Superga vundhi now a days situations👌
బాగుంధీ గురు నీ కవిత ………
🫡 నీ కవితలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి బావ 👏
ఫణి గారు మీ కవితలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.ఇన్సిపిరేషన్‌గా ఉంటాయి.మంచి వ్యాసం సార్
ప్రతి ఇంటా విద్యా కుసుమాలు వికసించక పోతే, విష విత్తులు నాటుకుంటాయి. అన్ని సమస్యలకి మూలం అవిద్య యే.
Great.. . Prastutha samajam pokadalanu vadaposina PHANI gaaroo neeku dhanyavaadaalu🩷🩷
రక్షాబంధన్ అంటే ఆడపిల్ల స్వాతంత్ర్యం తనకి ఇచ్చినరోజే…
ఈ విషయాన్ని చాలా ప్రస్పుటంగా మీ పదాలలో వ్యక్తపరిచారు… మనందరం ఆలోచించాల్సిన, మారాల్సిన సమయం
“యేన బద్ధో బలి రాజా,
దానవేంద్రో మహాబలః
తేన త్వామభి బద్నామి
రక్ష మాచల మాచల”
Nice
ఫణి మండల గారు రక్షాబంధన్ రోజున మీద్వారా అక్షరరూపం కల్పించబడిన రక్ష మాచల మాచల సాహిత్యం చాలా
బావుంది. సమాజంలో కొందరివలన జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అనే ఆవేదనకు అద్దం పడుతోంది.ప్రతి వ్యక్తి లోనూ చదువుతో పాటు సంస్కారం ఇనుమడించాలి.చేసిన ప్రతిజ్ఞ గాలికొదిలేసి బాధ్యతారాహిత్యం గాఉన్న సమాజానికి మీ ద్వారా కనువిప్పు కలగాలని,కలుగుతుందని ఆశిస్తూ
ఫణి మండల గారు రక్షాబంధన్ రోజున మీద్వారా అక్షరరూపం కల్పించబడిన రక్ష మాచల మాచల సాహిత్యం వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.
సమాజంలో కొందరివలన జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అనే ఆవేదనకు అద్దం పడుతోంది.ప్రతి వ్యక్తి లోనూ చదువుతో పాటు సంస్కారం ఇనుమడించాలి.చేసిన ప్రతిజ్ఞ గాలికొదిలేసి బాధ్యతారాహిత్యం గాఉన్న సమాజానికి మీ ద్వారా కనువిప్పు కలగాలని,కలుగుతుందని ఆశిస్తూ
ఇంకా ఏం యుగంలో ఉన్నారు ఫనిగారు ?
ఆ యుగం లో రావణాసురుడు ఒక్కడే కాని ఈ యుగంలో ప్రతి చోటా రావణాసురులే ….
ఇంకో యుగం లో ధుర్యోధనుడు ఒక్కడే కాని ఒక్కడే కాని ఇప్పుడు వీధి కుక్కల ఉన్నారు ఫనిగారు ….
ఈ యుగంలో అన్ని మట్టు కొట్టుకుపోయి పిన్నిగారు ….
ఒకోక్కరి ఆవేదన, ఒక్కో విధంగా, గలం ఒక్కరిది , కాలం ఒక్కరి ఇంత కన్నా ఏం చేయగలం ….
కనీసం మీలా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు గనుకే కొంత ఊరట నిస్తోంది ఫనిగారు…. ధన్యవాదాలు
Nice Phani
Chala bhavaudeganga undi
And eppati generation ki chala connect ayyela Masaru fani garu
Very nice Alldu 👌
Very nice
మంచి వాళ్ళమని
మనకు మనమే
సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ
మనను మించిన
గొప్పవాడు భువిని
లేడని మన డప్పు
గొప్పగా కొట్టుకుంటూ
శీలాలనుదోచుకునే
మూలాలను మనలో
దోచుకుంటున్న విధానం
కవిత లో అభివ్యక్తీకరించే
మీ తీరు బహు బాగు
అభినవ శ్రీ శ్రీ ….. మరో జాషువా …. మీ కవిత్వం నేటి ఈ సమాజానికి చాలా అవసరం …. మృగంగా మారిన మనిషి ని మరలా మనిషిగా మార్చే అద్భుతమైన మాటలు రాస్తున్నారు మీ నా విప్లవ వందనాలు …. కామ్రేడ్
నిజం, నిజం యదార్థం మన నేతిబీరకాయ నేతల నగ్న దృశ్యం. బీరాలు పలికే అభినవ ఉత్తర కుమారుల నిజస్వరూపం. మీరు తీసుకునే ఇతివృత్తం మొత్తం నేటి నిజ భారతం. చక్కని కవిత.
బాగుంది ఫణి గారు…
శీలానికి విలువలేని ఈరోజుల్లో విలువలు మూలన దాక్కున్నాయి..
మనమైనా పిల్లల్లో విలువలు పెంచకపోతే వారు తెలియకుండానే మునిగిపోతారు….
చాలా బాగుంది మీ కవిత ఫణి
Very good Thamudu
Ok keep it up
Fantastic
రక్ష మాచల మాచల….. ఎక్కడుంది
ఆ చలించని రక్ష నేడు….. ఎక్కడుంది
ఆ చలించని నమ్మకం…… ఎక్కడుంది
ఆ చలించని నిస్వార్థ బంధనం… ఎక్కడుంది
ఆ అచల సౌభ్రాతృత్వపు నిర్మల స్వాంతన…….
మీలాంటి నిస్వార్థ స్నేహం లో తప్ప……
చాలా బాగుంది ఫణి మన సమాజ మనుగడ పై మీ స్పందన