Just NationalJust Lifestyle

Blinkit: ఆగిన పెళ్లికి బ్లింకిట్‌తో శుభం కార్డ్.. నెటిజన్ల ప్రశంసలు

Blinkit: ఏ పెళ్లి వేడుకలోనైనా సింధూరం చాలా ముఖ్యం.. దానినే మరిచిపోవడంతో పెళ్లి నిలిచిపోయింది. సంప్రదాయాలకు భిన్నంగా అది లేకుండా పెళ్లి జరిగే పరిస్థితి లేదు.

Blinkit

ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే షాపుకు పరిగెత్తాల్సిందే.. కానీ కరోనా తర్వాత క్విక్ కామర్స్ యాప్ లదే రాజ్యం… ముందు ఫుడ్ డెలివరీతో మొదలైన వాటి ప్రయాణం ఇప్పుడు కాదేదీ డెలివరీకి అనర్హం అన్న పరిస్థితి చేరింది. బిజీగా గడిపే చాలా మంది జొమాటో , బ్లింకిట్(Blinkit), స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ చాలా ఉపయోగంగా ఉంటున్నాయి. సర్వీస్ ఛార్జ్ తీసుకున్నా సకాలంలో అందజేసే సౌలభ్యం ఉండడంతో నూటికి 90 శాతం మంది వీటికే ప్రాధాన్యతనిస్తున్నారు.

రాత్రీ, పగలూ తేడా లేకుండా ఈ యాప్స్ ద్వారా ఏదైనా తెప్పించుకోవచ్చు. తాజాగా బ్లింకిట్(Blinkit) యాప్ కారణంగా ఆగిపోయిన పెళ్లి సుఖాంతమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్… దేశ రాజధాని ఢిల్లీ ఓ జంట వివాహం అట్టహాసంగా జరుగుతోంది. అందరూ ముహూర్తం దగ్గర పడి హడావుడిలో ఉండగా.. సింధూరం మరిచిపోయిన విషయం గుర్తొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Vogueshaire Weddings (@vogueshaire)


ఏ పెళ్లి వేడుకలోనైనా సింధూరం చాలా ముఖ్యం.. దానినే మరిచిపోవడంతో పెళ్లి నిలిచిపోయింది. సంప్రదాయాలకు భిన్నంగా అది లేకుండా పెళ్లి జరిగే పరిస్థితి లేదు. దగ్గరలో షాపులు కూడా తెరిచి లేకపోవడంతో టెన్షన్ మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో షాపుకు పరిగెత్తకుండా బ్లింకిట్ (Blinkit)యాప్ ద్వారా సింధూరం ఆర్డర్ చేశారు. తర్వాత కేవలం 16 నిమిషాల్లోనే సింధూరాన్ని బ్లింకిట్ (Blinkit)డెలివరీ చేయగా వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.. దీంతో డెలివరీ బాయ్ కు థ్యాంక్స్ చెబుతూ బంధుమిత్రుల కేరింత నడుమ వరుడు వధువుకు సింధూరం దిద్దడంతో పెళ్లి తంతు ముగిసింది.

Blinkit
Blinkit

ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ అనుభవాన్ని పంచుకుంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. అత్యవసర సమయంలో ఆదుకున్న డెలివరీ బాయ్స్‌ను సూపర్ హీరోలుగా ప్రశంసిస్తున్నారు. ఒకవేళ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైతే అక్కడ బ్లింకిట్ ఉంటుందా అంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేశారు. మొత్తం మీద ప్రస్తుతం నిత్యజీవితంలో క్విక్ కామర్స్ యాప్ లు ఎంత ప్రత్యామ్నాయంగా మారిపోయాయో ఈ ఘటన రుజువు చేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button