Just NationalLatest News

Toll receipt: టోల్ రసీదు మీ భద్రతకు భరోసా అని తెలుసా?

Toll receipt: ఇకపై మీరు ఎప్పుడు టోల్ ఫీజు కట్టినా, ఆ రసీదును మీతో సురక్షితంగా ఉంచుకోండి.

Toll receipt

మీరు టోల్ రసీదును పారేస్తున్నారా? అయితే చాలా కోల్పోతున్నారన్న విషయాన్ని తెలుసుకోండి.టోల్ గేట్  (Toll receipt)దగ్గర ఫీజు కట్టగానే రసీదు ఇస్తారు. చాలామంది దాన్ని పట్టించుకోకుండా వెంటనే పారేస్తారు. కానీ మీకు తెలుసా, ఆ చిన్న కాగితంలో మీ భద్రతకు సంబంధించిన చాలా విలువైన విషయాలు దాగి ఉన్నాయి. అవును ఆ రసీదు.. మీకోసం కొన్ని స్పెషల్ హక్కులు, సౌకర్యాలు కల్పిస్తుంది.

మీరు టోల్ ఫీజు కట్టిన వెంటనే, ఆ నేషనల్ హైవేపై మీ భద్రత బాధ్యత టోల్ ఆపరేటర్లది అవుతుంది. అందుకే రసీదుపై వారి పేరు, కాంట్రాక్టర్ వివరాలు, ఇంకా అత్యవసర సహాయం కోసం ముఖ్యమైన ఫోన్ నంబర్లు ఉంటాయి.

టోల్ ఫీజు చెల్లించిన తర్వాత, మీరు టోల్ రోడ్డుపై ఉన్నంత వరకు ఈ కింది సేవలు మీ హక్కు అన్న విషయం తెలుసుకోవాలి. మీ కారు లేదా బైక్ ఇంజిన్ సమస్యతో అకస్మాత్తుగా ఆగిపోతే, టోల్ కంపెనీ మీకు ఉచిత టోయింగ్ సేవను అందిస్తుంది.

ఒకవేళ మీ వాహనంలో పెట్రోల్/డీజిల్ అయిపోతే, టోల్ అధికారి మీకు గరిష్టంగా 5-10 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా ఇవ్వవచ్చు. బ్యాటరీ డెడ్ అయితే, ఛార్జింగ్ సహాయం కూడా అందిస్తారు.టైర్ పంక్చర్ అయితే రహదారి సిబ్బంది పంక్చర్ మరమ్మత్తుకు సహాయం చేస్తారు లేదా సమీప సర్వీస్ సెంటర్‌కు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తారు.

Toll receipt
Toll receipt

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే, టోల్ రసీదుపై ఉన్న ఎమర్జెన్సీ నంబర్‌కు లేదా NHAI హెల్ప్‌లైన్ 1033కి కాల్ చేయండి. వారు వెంటనే అంబులెన్స్, ట్రాఫిక్ పోలీసులు మరియు క్రేన్ సేవలకు సమాచారం ఇస్తారు.ప్రయాణంలో అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య వస్తే, టోల్ మేనేజ్‌మెంట్ మీకు అత్యవసర అంబులెన్స్ సేవను అందిస్తుంది.

ఇకపై మీరు ఎప్పుడు టోల్ ఫీజు కట్టినా, ఆ రసీదును మీతో సురక్షితంగా ఉంచుకోండి. అందులోని నంబర్లు ఎప్పుడైనా మీ ప్రాణాలను కాపాడగలవు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో, NHAI హెల్ప్‌లైన్ 1033కి కాల్ చేసి, టోల్ ప్లాజా పేరు చెబితే త్వరగా సహాయం అందుతుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button