Digital Governance: డిజిటల్ గవర్నెన్స్..ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఎలా అధిగమించాలి?
Digital Governance: డిజిటల్ గవర్నెన్స్ వల్ల ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి (Benefits) నేరుగా అర్హులైన ప్రజల బ్యాంక్ ఖాతాలకు చేరుతోంది.
Digital Governance
ప్రభుత్వ పాలనలో (Governance) సాంకేతికత (Technology) యొక్క వినియోగం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఆధార్, యూపీఐ (UPI) వంటి డిజిటల్ ఐడెంటిఫికేషన్ , పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించి, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు , ఆర్థిక సహాయాన్ని ప్రజలకు నేరుగా, వేగంగా అందించే విధానాన్నే ‘డిజిటల్ గవర్నెన్స్’ అంటారు.
కేంద్ర ప్రభుత్వంతో పాటు చాలా రాష్ట్రాలు ఈ విధానానికి తమ మద్దతును తెలియజేస్తూ వీటినే ఫాలో అవుతున్నారు.అందుకే ఈ విధానంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. సేవలను అందించడంలో పారదర్శకతను (Transparency) పెంచి, లంచాలు ,అవినీతి (Corruption)కి అవకాశం లేకుండా చేయడం దీని యొక్క అతి పెద్ద విజయం.
డిజిటల్ గవర్నెన్స్(Digital Governance) వల్ల ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి (Benefits) నేరుగా అర్హులైన ప్రజల బ్యాంక్ ఖాతాలకు చేరుతోంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లీకేజీలు (Leakages) లేకుండా సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ సర్వీసులను కూడా దీని ద్వారా ప్రజలు సులభంగా పొందగలుగుతున్నారు. సమయం ఆదా అవ్వడమే కాక, ప్రభుత్వ యంత్రాంగం యొక్క సమర్థత (Efficiency) కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఈ డిజిటల్ ప్రయాణంలో కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయంటున్నారు నిపుణులు.

డేటా గోప్యత (Data Privacy).. పౌరుల యొక్క సున్నితమైన వ్యక్తిగత డేటా (Personal Data) భారీ స్థాయిలో ప్రభుత్వాల వద్ద నిక్షిప్తమవుతోంది. ఈ డేటాను దుర్వినియోగం చేయకుండా లేదా సైబర్ దాడుల (Cyber Attacks) నుంచి రక్షించడానికి కఠినమైన డేటా సెక్యూరిటీ చట్టాలు , నియంత్రణలు అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిజిటల్ విభజన (Digital Divide).. ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల ప్రజలు, టెక్నాలజీ వాడకంపై అవగాహన లేని వృద్ధులు ఈ డిజిటల్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ డిజిటల్ విభజనను తగ్గించడం ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద సవాలుగా మారింది.
డిజిటల్ గవర్నెన్స్ (Digital Governance)అనేది కేవలం ఒక పరిపాలనా పద్ధతి కాదు. ఇది ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే ఒక సాధనం. గోప్యతతో పాటు యాక్సెసిబిలిటీ (Accessibility) సమస్యలను పరిష్కరిస్తే, ఈ విధానం భారత్‌ను ప్రపంచానికే ఆదర్శంగా నిలబెట్టగలదు.



