Gold :గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐదు రోజుల్లో తులంపై ఎంత తగ్గిందో తెలుసా!
Gold:రుసగా ఐదో రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత సోమ, మంగళవారాల్లో భారీగా తగ్గిన బంగారం ధర, ఇవాళ స్వల్పంగా తగ్గింది.

Gold
బంగారం కొనుగోలుదారులకు ఇది శుభవార్త అనే చెప్పొచ్చు. వరుసగా ఐదో రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత సోమ, మంగళవారాల్లో భారీగా తగ్గిన బంగారం ధర, ఇవాళ స్వల్పంగా తగ్గింది. దీంతో గత ఐదు రోజుల్లో తులం బంగారం ధర సుమారు ₹2,000 వరకు తగ్గింది.
నేడు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం(gold) ధరపై రూ. 50 తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై రూ. 40 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర రూ. 3,350 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరలో మాత్రం దేశీయ మార్కెట్‌లో ఎలాంటి మార్పులు లేవు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹92,900గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 1,01,350కి చేరింది. అదే సమయంలో, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93,050గా, 24 క్యారెట్ల ధర రూ.1,01,500గా ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా తెలుగు రాష్ట్రాల ధరలతో సమానంగా ఉంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,25,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర ₹1,15,000 కాగా, చెన్నైలో మాత్రం రూ. 1,25,000 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే, ధరల్లో మార్పులు ఉండవచ్చు.