Haryana Police: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్స్ అరెస్ట్.. ఫలించిన హర్యానా పోలీసుల ఆపరేషన్
Haryana Police: హర్యానాలోనే చాలా కేసులు రాణా మీద నమోదయ్యాయి. కేవలం హర్యానా మాత్రమే కాకుండా పంజాబ్ , ఢిల్లీల్లోనూ తన నేరసామ్రాజ్యాన్ని భాను రాణా విస్తరించాడు.
Haryana Police
విదేశాల్లో ఉంటూ భారత్ లో అనైతిక కార్యాకలాపాలు, నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు ఎట్టకేలకు అరెస్టయ్యారు. గత కొంతకాలంగా పలుచోట్ల క్రిమనల్ సామ్రాజ్యాలను విస్తరించి విదేశాల నుంచే గ్యాంగులను నడుపుతున్న గ్యాంగ్ స్టర్ వెంకటేశ్ గార్గ్ , లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్న భాను రాణాను హర్యానా పోలీసులు(Haryana Police) పట్టుకున్నారు. వెంకటేశ్ గార్గ్ ను జార్జియాలో అరెస్ట్ చేయగా… భాను రాణాను అమెరికాలోనూ అరెస్ట్ చేశారు.
అమెరికా పోలీసుల సహాయంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మోస్ట్ వాంటెడ్ క్రిమనల్స్.. ఎప్పటి నుంచో విదేశాల్లోనే ఉంటూ క్రిమినల్ సిండికేట్లను నడుపుతూ ఇక్కడ దందా సాగిస్తున్నారు. వీరిద్దరిపై పదుల సంఖ్యలో క్రిమిలన్ కేసులున్నాయి. అమాయక నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి తమ ముఠా సభ్యులుగా నియమించుకుని వారి చేత క్రిమనల్ పనులు చేయిస్తున్నాడు.

దీని కోసం విదేశాల్లో దాక్కుని ఇక్కడ కొందరు కీలక సభ్యులతో మొత్తం ముఠాను లీడ్ చేయడంలో వీరిద్దరూ ఆరితేరినట్టు పోలీసులు చెబుతున్నారు. బీఎస్పీ నేత హత్య కేసులో వెంకటేశ్ గార్డ్ పై అనుమానం రావడంతో పోలీసులు నిఘా వర్గాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అతను జార్జియాలో ఉన్నట్టు సమాచారం అందడంతో హర్యానా పోలీసుల(Haryana Police) స్పెషల్ టీమ్ , భద్రతా అధికారులతో కలిసి వెళ్ళి అరెస్ట్ చేసారు. గార్డ్ హర్యానాలోని నారాయణ్ గడ్ కు చెందిన వాడు. గురుగ్రామ్ లో బీఎస్బీ నేత హత్య జరిగిన తర్వాత వెంకటేశ్ గార్గ్ జార్జియాకు పారిపోయాడు.
అంతకుముందు ఇక్కడే జరిగిన పలు బెదిరింపు, హత్య కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు.
విదేశాల్లో ఉంటూ కార్యాకలాపాలు సాగించే మరో గ్యాంగ్‌స్టర్ కపిల్ సాంగ్వన్‌తో కలిసి బెదిరింపుల దందాను నడుతున్నాడు. ఇటీవల ఓ ఫామ్ హౌస్ బిల్డర్ ను బెదిరించే క్రమంలో వీరి ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని తమదైన శైలిలో విచారించినప్పుడు జార్జియాలో వెంకటేశ్ గార్డ్ ఉన్న విషయం తెలిసింది.
మరో కరుడుగట్టిన నిందితుడు భాను రాణా కోసం కూడా పోలీసులు చాలా కాలం నుంచి వెతుకుతున్నారు. అతనికి బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని తేలిన తర్వాత అమెరికాకు పారిపోయాడు. చాలా కాలంగా బెదిరింపుల సిండికేట్లలో కీలక సభ్యుడిగా దందా చేస్తున్నాడు.
హర్యానాలోనే చాలా కేసులు రాణా మీద నమోదయ్యాయి. కేవలం హర్యానా మాత్రమే కాకుండా పంజాబ్ , ఢిల్లీల్లోనూ తన నేరసామ్రాజ్యాన్ని భాను రాణా విస్తరించాడు. దీని కోసం నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి, తన ముఠాలో సభ్యులుగా చేర్చుకుంటున్నట్టు గుర్తించారు. త్వరలోనే వీరిద్దరీ భారత్ కు తీసుకురానున్నట్టు హర్యానా పోలీసు వర్గాలు వెల్లడించాయి.



