Just NationalJust BusinessLatest News

Kangana: నా బిజినెస్ రూ.50,జీతాలు రూ.15 లక్షలిచ్చా.. కంగన హాట్ కామెంట్లు

Kangana: తాజా పరిస్థితులపై ప్రధానికి లేఖ రాస్తానని, ప్యాకేజీ కింద ఆర్థిక సహాయం కోరతానని కంగన బాధితులతో చెప్పారు.

Kangana

బాలీవుడ్ నటి, లోక్ సభ ఎంపీ కంగనా(Kangana) రనౌత్ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా కంగన హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతంలో పర్యటించారు. ఇటీవల అక్కడ భారీ వరదలు సంభవించాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు.

స్థానిక ఎంపీగా అక్కడ పర్యటించిన ఆమె బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను కలిసి తమ కష్టాలను వెళ్ళబోసుకున్నారు. చాలా మంది తమ ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులయ్యామంటూ చెప్పుకున్నారు. వారి బాధను అర్థం చేసుకున్నప్పటకీ కంగన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మనాలీలో ఇటీవలే ప్రారంభించిన రెస్టారెంట్ కూడా నష్టాల్లో ఉందని చెప్పుకొచ్చారు. ఒకరోజు కేవలం 50 రూపాయలు మాత్రమే బిజినెస్ చేసినా.. తాను సిబ్బందికి 15 లక్షల రూపాయలు జీతాలుగా ఇస్తున్నట్టు వ్యాఖ్యానించారు. తాను మనిషినేనని, తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు.

వారికి సహాయం చేయడానికి తన దగ్గర నిధులు లేవంటూ చెప్పుకొచ్చారు. గతంలోనూ కంగన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు మండి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. పలువురు బాధితులు వచ్చి సహాయం చేయమని కోరారు. దీంతో అసహనానికి లోనైన కంగన తాను కేంద్రమంత్రిని కాదని, తన దగ్గర నిధులు ఏమీ లేవంటూ చెప్పారు. విపత్తు నిధులు మంత్రులకు మాత్రమే వస్తాయంటూ అక్కడి బాధితులకు వెల్లడించారు. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Kangana
Kangana

కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ఎంపీగా మాట్లాడాల్సిన మాటలు కాదంటూ విమర్శలు గుప్పించారు. తర్వాత ఈ విమర్శలకు కంగన కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తన దగ్గర డబ్బులు లేవనే విషయాన్ని చెప్పడంలో తప్పేముందంటా జవాబిచ్చారు.

ఇప్పుడు కూడా తాజా పరిస్థితులపై ప్రధానికి లేఖ రాస్తానని, ప్యాకేజీ కింద ఆర్థిక సహాయం కోరతానని బాధితులతో చెప్పారు. కాగా హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఇప్పటి వరకూ 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా… వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగిపడడంతో పాటు క్లౌడ్ బరస్ట్ పరిస్థితులతో విధ్వంసం నెలకొంది. వందలాది ఇళ్ళు కొట్టుకుపోవడంతో పాటు ధ్వంసమయ్యాయి.

Credit card: క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకి షాక్.. ఇక రెంట్ పేమెంట్స్ బంద్

Related Articles

Back to top button