Just NationalLatest News

Outdoor activities: స్టూడెంట్స్‌కు అవుట్ డోర్ యాక్టివిటీస్ రద్దు..ఏం జరిగింది?

Outdoor activities: తీవ్రమైన కాలుష్య పరిస్థితి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CAQM కొన్ని ఆంక్షలను ప్రకటించింది.

Outdoor activities

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) , దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యం (Air Pollution) వల్ల, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో వాయు కాలుష్యం, పాఠశాలల అవుట్‌డోర్ యాక్టివిటీస్‌(Outdoor activities)పై CAQM నిషేధం..ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. తాజాగా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 391గా ఉంది, ఇది ‘చాలా పేలవం’ (Very Poor) కేటగిరీకి చెందుతుంది. ఈ తీవ్రమైన కాలుష్య పరిస్థితి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CAQM కొన్ని ఆంక్షలను ప్రకటించింది.

NCR పరిధిలోని అన్ని పాఠశాలలు , కళాశాలల్లో అవుట్‌డోర్ (బయటి) కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు CAQM ప్రకటించింది.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రమైన కాలుష్యం కారణంగా పిల్లలు , యువత శ్వాసకోశ సమస్యలకు గురికాకుండా ఉండేందుకు ఈ చర్య అవసరం అని భావిస్తున్నట్లు వివరించింది.

Outdoor activities
Outdoor activities

ఇప్పటికే అనేక ప్రముఖ పాఠశాలలు తమ అవుట్‌డోర్ యాక్టివిటీస్ అయిన యోగా, ఇండోర్ గేమ్స్, డ్యాన్స్ క్లాసులను సైతం రద్దు చేశాయి. కొన్ని వాటిని మూసివేసిన ప్రాంతాలకు మార్చాయి.

ఒకవైపు విద్యార్థులను కాలుష్యం నుంచి రక్షించడానికి ఈ నిషేధం అవసరం అయినా కూడా, దీనిపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవుట్‌డోర్ యాక్టివిటీస్(Outdoor activities) రద్దు చేయడం వలన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చురుకైన క్రీడలు లేకపోవడం దీర్ఘకాలంలో శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

ఈ నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే దానిపై CAQM నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తిరిగి 300 దిగువకు (Poor to Moderate Category) చేరుకున్న తర్వాత మాత్రమే అవుట్‌డోర్ యాక్టివిటీస్‌ను అనుమతించే అవకాశం ఉన్నట్లు అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఈ విధంగా వాయు కాలుష్యం తగ్గే వరకు ఈ ఆంక్షలు(Outdoor activities) అమలులో ఉండే అవకాశం ఉంది.

Miss Universe 2025:  విశ్వ సుందరి-2025 కిరీటం మెక్సికో సొంతం..ఫాతిమా బాష్‌దే టైటిల్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button