Just TelanganaLatest News

Schools :యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. ఏ ప్రయోజనాలుంటాయ్?

Schools :తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్' ను నిర్మించనున్నారు. మొత్తం 105 పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.

Schools

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి ఒక వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఈ ప్రణాళికలో భాగంగా, పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు సైతం కార్పొరేట్ పాఠశాల(Schools)లకు ధీటుగా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ ను నిర్మించనున్నారు. మొత్తం 105 పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, మిగతావాటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రతి పాఠశాలలో 2,560 మంది విద్యార్థులకు సీట్లు అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా సుమారు 2.7 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్య లభిస్తుంది.

Schools
Schools

ఈ పాఠశాలల్లో(Schools) ఆంగ్ల మాధ్యమంలో బోధన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, స్టేడియంలు , నివాస సౌకర్యాలు వంటివి ఉంటాయి. ముఖ్యంగా, రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల(Schools )ల్లో 90 శాతం మంది ఉన్నారు. వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.

ఈ భారీ ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రిని రూ. 30,000 కోట్లు కేటాయించవలసిందిగా కోరారు. ఇందులో రూ. 21,000 కోట్లు కొత్త పాఠశాలల నిర్మాణానికి, రూ. 9,000 కోట్లు ఉన్నత విద్యాలయాలు, జూనియర్, డిగ్రీ, టెక్నికల్ కళాశాలల్లో ప్రయోగశాలలు అప్గ్రేడ్ చేయడానికి వినియోగించనున్నారు. అదనంగా, గత ప్రభుత్వం అధిక వడ్డీకి తీసుకున్న రుణాలను పునఃసంవిధానం చేసి, అప్పుల పరిమితి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇది రాష్ట్రానికి మరింత నిధులు సేకరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రాజెక్ట్‌పై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గతంలో ఉన్న ప్రభుత్వాల మాదిరిగా కేంద్రంతో పోరాడకుండా, ప్రజల సంక్షేమం కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కనుక విజయవంతమైతే, తెలంగాణ విద్యారంగంలో దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది.

CP Radhakrishnan: భారతదేశ 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌.. దక్షిణాదికి దక్కిన గౌరవం

Related Articles

Back to top button