Just NationalLatest News

Janaza-e-Ghaib: ఉగ్రవాదికి జనాజా ఏ గైబ్ విధానంలో అంత్యక్రియలు..జనాజా ఏ గైబ్ ఏంటంటే?

Janaza-e-Ghaib: పీవోకేలో ఉగ్రవాది తాహిర్ హబీబ్‌కి అంతిమ సంస్కారాలు

Janaza-e-Ghaib

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో శనివారం ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పహల్గాం (Pahalgam) సెక్టార్‌లో ఇటీవల భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్ హబీబ్కు, పీవోకేలో మృతదేహం లేకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘జనాజా ఏ గైబ్’ (Janaza-e-Ghaib) అనే ప్రత్యేక ఇస్లామిక్ పద్ధతిలో చేపట్టారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇది ఎప్పటికైనా ఒక పౌరుడు లేదా మతమార్గదర్శకుడి పట్ల గౌరవ సూచకంగా నిర్వహించే చర్య ఇది.

జనాజా ఏ గైబ్ (Janaza-e-Ghaib) అంటే ఏంటి? ఎప్పటి నుంచీ ఉంది?
‘జనాజా’ అంటే శవయాత్ర. ‘గైబ్’ అంటే గైర్హాజరు. కలిపితే జనాజా ఎ గైబ్ అంటే మృతదేహం లేకపోయినా, ఆ వ్యక్తి తరఫున నిర్వహించే శవయాత్ర నమాజ్. ఇది ప్రత్యేకంగా ముస్లిం సంప్రదాయంలో ఉన్న పద్ధతి. మృతుని శరీరం అందుబాటులో లేకపోయినప్పుడు.. ఉదాహరణకు ఆ దేశంలోకి తీసుకురాలేకపోతే, లేదా యుద్ధంలో మాయమైతే, లేదా శత్రుదేశంలో పడిపోయి లభించకపోతే ఇది నిర్వహిస్తారు.

ఈ సంప్రదాయం 7వ శతాబ్దం నుంచీ ఉంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) కూడా తన సహచరుల్లో ఒకరి కోసం జనాజా ఎ గైబ్ చేసినట్లు హదీసుల్లో ఉంది. ఇప్పటికీ పాకిస్థాన్, పెలస్తీన్, ఆఫ్రికన్ దేశాల్లో ఈ విధానం కనిపిస్తుంది . ప్రత్యేకించి ఉగ్రవాదులను మరణించిన వారిగా గౌరవించే కొన్ని సందర్భాల్లో ఇది కనిపిస్తుంది.

ఈ పద్ధతిని సాధారణంగా చాలా అరుదైన సందర్భాల్లో గురుత్వం ఉన్న మత నాయకులు, లేదా ప్రభావం చూపిన వ్యక్తుల పట్ల నిర్వహిస్తారు. కానీ తాజాగా తాహిర్ హబీబ్ వంటి ఉగ్రవాది పట్ల కూడా ఈ విధానాన్ని అనుసరించడమంటే . పీవోకేలో ఉగ్రవాదుల పట్ల భారతీయలు ఎంత మానవత్వాన్ని చూపే ప్రయత్నమే అని విశ్లేషకులు అంటున్నారు.

Janaza-e-Ghaib
Janaza-e-Ghaib

భారత భద్రతా బలగాలు పహల్గాం మల్లా ప్రాంతంలో ఈ ఆపరేషన్ “మహాదేవ్” పేరిట ముగ్గురిని మట్టుబెట్టాయి. వారిలో తాహిర్ హబీబ్‌ను భారత దళాలు అంతమొందించగా, అతని మృతదేహాన్ని భారత్ నుంచి తీసుకెళ్లలేకపోయారు. అందుకే, పీవోకేలో అతడి కుటుంబ సభ్యులు ‘జనాజా ఏ గైబ్’ ద్వారా ఘనంగా సంస్కారాలు చేశారు.

భారత భద్రతా దళాలు ఎలాగైనా ఉగ్రవాదాన్ని ధ్వంసం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నా, పీవోకేలో ఇలాంటి గౌరవ సత్కారాలు, మతపరమైన భావోద్వేగాల పేరిట ఉగ్రవాదులకు మద్దతుగా మారుతున్న ఈ తత్వం అర్థం చేసుకోవాల్సిన విషయం. “జనాజా ఏ గైబ్” (Janaza-e-Ghaib)అనే ఆచారం ఒక వైపు మానవతా కోణాన్ని చూపిస్తే, మరోవైపు అటవీ చట్టాలపై నడిచే ఉగ్రతత్వానికి మద్దతు చాటడానికీ మారింది అనే విమర్శలు ఎదురవుతున్నాయి.

Also Read: Dead Economy: డెడ్ ఎకానమీపై మోదీ ఆన్సర్ ఓకే ..మరి వాస్తవ పరిస్థితి ఏంటి?

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button