Just NationalLatest News

Uttarakhand floods: క్లౌడ్ బరస్ట్ కల్లోలం..ఉత్తరాఖండ్‌లో ఊళ్లనే మింగేసిన వరద

Uttarakhand floods: కల్లు తెరిచే లోపే వరద ముంచెత్తింది: ఉత్తరకాశిలో మహా విషాదం

Uttarakhand floods

హిమాలయాల శిఖరాల్లోని థరాలి గ్రామం ఒక్కసారిగా వచ్చిపడిన వరదలో నీట మునిగిపోయింది. క్లౌడ్ బరస్ట్ (cloudburst disaster) దెబ్బకు ఖీర్ గంగా నది ఉప్పొంగి గ్రామాన్ని చుట్టుముట్టింది. ఏ గాలీ గాలిలోనూ ఊహించని విధంగా వరదలు వచ్చాయి. నిద్రలో ఉన్నవారు ఒక్కసారిగా మేల్కొనకముందే, నీటి ఉద్ధృతి ఇళ్లు తుడిచిపెట్టేసింది. పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 60 మందికిపైగా గల్లంతయ్యారనే సమాచారం అధికారులు వెల్లడించారు.

పెరిగిన నీటి మట్టం.. విరిగిన కొండచరియలు.. ఒక్కసారిగా ప్రకృతి తాండవంగా మారిన సమయంలో గ్రామస్తులు తేరుకోక ముందే వరద ముప్పేట ముంచేసింది. శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు SDRF, ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. హర్సిల్ ప్రాంతంలో గల ఖీర్ గఢ్ వద్ద నది మట్టం ప్రమాదకరంగా పెరగడం వల్ల ధరాలీలో మరింత విధ్వంసం చోటుచేసుకుంది.శిథిలాల కింద ఇంకా ప్రాణాలు వున్నాయేమో అన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Uttarakhand floods
Uttarakhand floods

ఈ వరదల మానవ వనరులపై ఎంతటి ప్రభావం చూపించిందో ఇప్పుడే చెప్పలేం. కానీ అక్కడి ప్రజల గుండెల్లో పుటపుటలాడుతున్న భయాన్ని అక్షరాల్లో వ్యక్తం చేయడం అసాధ్యం. మా ఊరు మిగిలిందా..? మా కుటుంబం ఉందా..?” అనే ప్రశ్నలతో ప్రజలు విలపిస్తున్నారు. క్షణాల్లో ఊళ్లు మింగేసిన ప్రకృతి ఆగ్రహానికి ఎదురైన వారిని ఇప్పుడైనా కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఘటనపై (Uttarakhand floods) ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఉన్న ఆయన, జిల్లా అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Also read: Phone tapping: బండి సంజయ్ ఎంట్రీ… కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తుందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button