Just NationalLatest News

Uttarkashi video: ఉత్తరకాశీలో మృత్యుంజయులు ..వీడియో వైరల్

Uttarkashi video: ఉత్తరకాశి (Uttarkashi)జిల్లాలో ధరాలీ అనే చిన్న గ్రామంలో క్లౌడ్ బరస్ట్ వల్ల కురిసిన భారీ వర్షాలు, అకస్మాత్తుగా వచ్చిన వరద అక్కడి ప్రజల జీవితం తలకిందులయ్యేది చేశాయి.

Uttarkashi video

ఉత్తరకాశి (Uttarkashi)జిల్లాలో ధరాలీ అనే చిన్న గ్రామంలో క్లౌడ్ బరస్ట్ వల్ల కురిసిన భారీ వర్షాలు, అకస్మాత్తుగా వచ్చిన వరద అక్కడి ప్రజల జీవితం తలకిందులయ్యేది చేశాయి. నదిలో కాసేపట్లోనే నీరు పెద్దగా వచ్చింది. ఎన్నో ఇళ్లు, షాపులు, హోటళ్లు ఈ వరదలో కొట్టుకుపోయాయి.

ఈ ప్రమాద సమయంలో ఇద్దరు వ్యక్తులు మట్టిలో పూర్తిగా చిక్కుకుని.. అతి కష్టం మీద బయటకి వచ్చిన దృశ్యం(Uttarkashi video) వీడియోలో రికార్డ్ అవ్వడం తెలిసింది. ఈ మృత్యుంజయులు అతి కష్టం మీద తప్పించుకుంటూ , బురదలో పాక్కుంటూ బయటికి వచ్చారు.

ఈ వీడియోను తీస్తూ అక్కడి వాళ్లు వాళ్లకు ధైర్యం చెప్పడం దీనిలో కనిపించింది. వీడియోలో వాళ్ల ప్రయత్నాన్ని చూసిన ప్రతి ఒక్కరు ధైర్యం అంటే ఇదే, పోరాడటం నేర్చుకోవాలి అని అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వరదలో కనీసం నలుగురు మృతి చెందారని… ఇంకా కొంత మంది కనిపించకుండా పోయారని అధికారులు చెప్పారు. గ్రామంలో అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అధికారుల టీమ్స్ అక్కడికి వెళ్లి, సహాయక చర్యలు చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరు బయటపడిన వారి వీడియో వైరల్( viral rescue video) అవుతోంది. ఈ ఘటన మనందరికీ .. ఎంత ప్రమాదాన్ని అయినా ఆశ, ధైర్యంతో పోరాడితే… మనం కష్టాలను దాటొచ్చు అనే బలమైన సందేశాన్ని ఇచ్చింది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button