Just NationalJust PoliticalLatest News

Vijay:విజయ్ విజిల్ సౌండ్.. తమిళనాట అధికార పక్షానికి చెమటలు పట్టిస్తుందా?

Vijay: తన పార్టీ ఏ ఒక్క వర్గానికో కాకుండా తమిళనాడు సమగ్ర అభివృద్ధి కోసం పోరాడుతుందని విజయ్ చెబుతూ వస్తున్నారు.

Vijay

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సారధ్యంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే ఎన్నికల్లో విజయ్ ఈ గుర్తుతోనే బరిలోకి దిగబోతున్నారు.

సామాజిక న్యాయం, పారదర్శకత నినాదంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న విజయ్(Vijay).. ఇప్పటికే 12 మందితో కూడిన కో-ఆర్డినేషన్ కమిటీని నియమించి మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో కూడా పడ్డారట. అన్నాడీఎంకే, డీఎంకే వంటి దిగ్గజ పార్టీల మధ్య విజయ్ పార్టీ ఎంత వరకూ ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

విజయ్ పార్టీకి గుర్తు కేటాయించిన ఈ సమయంలో రాజకీయంగా ఒక పెద్ద చర్చ సాగుతోంది. విజయ్‌ను తమ కూటమిలోకి ఆహ్వానించడానికి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ముఖ్యంగా బీజేపీతో పొత్తు కోసం ఒత్తిడి చేయడానికే విజయ్‌ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో వేధిస్తున్నారనే పుకార్లు తమిళనాట బలంగా వినిపించాయి. అయితే, విజయ్ మాత్రం ఎవరితోనూ పొత్తు గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పార్టీ ఏ ఒక్క వర్గానికో కాకుండా తమిళనాడు సమగ్ర అభివృద్ధి కోసం పోరాడుతుందని విజయ్ చెబుతూ వస్తున్నారు.

Vijay
Vijay

తమిళనాడులోని 234 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 118 రావాలి. ప్రస్తుతం డీఎంకే కూటమి 157 సీట్లతో బలంగా ఉండగా, అన్నాడీఎంకే 67 సీట్లతో ఉంది. విజయ్ ఎంట్రీతో ఈ సమీకరణాలు ఎలా మారుతాయా అనేది చూడాలి. గతంలో విజయకాంత్ డీఎండీకే పార్టీకి ఢమరుకం గుర్తు వచ్చినట్లుగానే, ఇప్పుడు విజయ్‌కి విజిల్ రావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

అమ్మ జయలలిత, కరుణానిధి లేని ఈ సమయంలో విజయ్(Vijay) ఒక కొత్త ఆశగా కనిపిస్తున్నారని ఆయన ఫ్యాన్స్ , మద్దతుదారులు అనుకుంటున్నారు. అయితే ఈ విజిల్ సౌండ్ తమిళనాట అధికార పక్షానికి చెమటలు పట్టిస్తుందా లేదా అనేది కొద్ది నెలల్లో తేలిపోనుంది.

Bangladesh : భారత్‌లో మేము ఆడము..వరల్డ్ కప్ బహిష్కరించిన బంగ్లాదేశ్

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button