Just PoliticalJust National

Maharashtra politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం.. కూటమిలో భగ్గుమంటున్న విభేదాలు

Maharashtra politics: మహాయుతిలోని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం కూటమిలో కుంపటి రాజుకుందన్న అనుమానాలను బలపరుస్తోంది.

Maharashtra politics

రాజకీయా(Maharashtra politics)ల్లో కూటమి ప్రభుత్వాలను నడపడం అంత ఈజీ కాదు. కేంద్రంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు అంతర్గత విభేదాలు ఉంటూనే ఉంటాయి. వాటిని చక్కగా సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా సర్కారు కుప్పకూలడం ఖాయం. అయితే పార్టీల మధ్య ఎప్పుడు విభేదాలు వస్తాయో చెప్పలేం. ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాయుతి కూటమి సర్కారులో విబేధాలు హాట్ టాపిక్ గా మారాయి.

మున్సిపల్ ఎన్నికల(Maharashtra politics) వేళ తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేయకూడదనే బీజేపీ, షిండే సారథ్యంలోని శివసేన మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో కూటమిలో ఉద్రిక్తతలు పెరిగాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే‌ ఈ విభేదాల ప్రచారం నిజం కాదని చెబుతున్నా.. కొన్ని పరిణామాలు మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నాయి.

వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోకపోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. అలాగే షిండే శివసేన మంత్రులు క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టడంతో విభేదాలు రాజుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా బీజేపీపై విమర్శలు చేస్తుండడంతో కూటమిలో సవ్యంగా లేదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Maharashtra politics
Maharashtra politics

ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల (Maharashtra politics)ప్రచారంలో కూటమి పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. గత వారం ఈ ప్రచారంలో భాగంగా ఫడ్నవీస్, షిండే ఒకే హోటల్ లో ఉన్నా ఒకరినొకరు కలుసుకోకపోవడంతో ఈ ప్రచారం మొదలైంది. అయితే తాను షిండే కంటే ఎక్కువ మీటింగ్స్ ఉన్న కారణంగా ఆలస్యంగా రావడంతో కలవడం కుదరలేదంటూ ఫడ్నవీస్ చెప్పారు.

తాము రోజూ ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటామన్నారు. మరోవైపు తాను కూడా ఇలాంటి వార్తలు వింటూనే ఉంటున్నానని, అవన్నీ పట్టించుకునే సమయం లేదంటూ షిండే వ్యాఖ్యానించారు. ఇలా అంటూనే సంకీర్ణ ధర్మం పాటించాలంటూ వ్యాఖ్యానించడం అనుమానాలకు తావిస్తోంది. తాము సంకీర్ణ ధర్మం పాటిస్తున్నామని, కూటమిలోని అన్ని పార్టీలు పాటించాలంటూ కోరారు.

మహాయుతిలోని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం కూటమిలో కుంపటి రాజుకుందన్న అనుమానాలను బలపరుస్తోంది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందంటూ ఎన్సీపీ నేత, అజిత్ పవార్ సన్నిహితుడు మాణిక్‌రావ్ కొకాటే విమర్శించారు. అలాగే శివసేన కార్యకర్తలను, నేతలను బీజేపీ తన పార్టీలో చేర్చుకోవడం షిండే శివసేనకు కోపం తెప్పించింది. ఈ కారణంగానే క్యాబినెట్ మీటింగ్ కు రాలేదని భావిస్తున్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button