Just PoliticalLatest News

Politics: ఏపీ, తెలంగాణలో అదే ‘లెక్కల’ రాజకీయం..

Politics: బుక్ పాలిటిక్స్ ఒక రాజకీయ వ్యూహంగా ఉపయోగపడుతుందే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Politics

రెండు తెలుగు రాష్ట్రాలు.. సెపరేట్ అయినా జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలలో(Politics) మాత్రం సేమ్ సీన్ నడుస్తూ ఉంటుంది. కుటుంబ తగాదాల నుంచి మొదలు అధికార ప్రతిపక్ష నేతల తీసుకున్న నిర్ణయాలు వరకూ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి.

ఇదే కోవలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Politics)కొంతకాలంగామేము తిరిగి అధికారంలోకి వస్తాం, అప్పుడు అందరి లెక్కలు తేలుస్తాం’ అనే నినాదం కూడా బూమ్ రాంగ్‌లా తిరుగుతూనే ఉంది. అప్పుడు అలా చెప్పిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు..లెక్కలు తేల్చేపనిలో బిజీ కూడా అయ్యారు.

అంతేకాదు ఎన్నికల ప్రచారంలో లోకేశ్ తన పాదయాత్రలో రెడ్ బుక్ ను చూపించి, వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు చేసిన అధికారులు, నేతల పేర్లు ఇందులో ఉన్నాయని హెచ్చరించడం దీనికి ఉదాహరణే.

ఈ బుక్‌లో ఉన్న వారికి టీడీపీ అధికారంలోకి రాగానే తగిన శిక్ష తప్పదని లోకేశ్ పదే పదే చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఇలాంటి నినాదాలతోనే ప్రజల్లోకి వెళ్లారు. ఈ వ్యూహం అధికార పార్టీలపై ఉన్న వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోసి, కాంగ్రెస్, టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి బలమైన కారణమైంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ లోకేష్‌ రెడ్ బుక్ పాలసీనే ఫాలో అవుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తాము ‘పింక్ బుక్’ రెడీ చేస్తున్నామనే హెచ్చరికలు పంపిస్తున్నారు.

తమ ప్రభుత్వాలపై అక్రమ కేసులు బనాయించిన అధికారులు, తాము అధికారంలో ఉండగా ఇబ్బందులు సృష్టించిన వారి వివరాలు ఈ బుక్‌లో ఉన్నాయని, రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని వీరు పదే పదే అంటున్నారు.

అధికారంలోంచి దిగిపోయిన జగన్, కేటీఆర్ ఇప్పుడు తిరిగి అదే బాటలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ వైసీపీ, బీఆర్ఎస్ పాలన బాగాలేదనే కారణంతోనే ఆ రెండు పార్టీలను ఓటర్లు ఓడించారు. ఇప్పుడు అదే ఓటర్లు వీరి బుక్ ‌ను చూసో, వీరి మాటలు నమ్మో మళ్లీ వీరికి అవకాశం ఇస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్న.

politics
politics

అప్పుడు లోకేష్ ‘రెడ్ బుక్’ అనేది అప్పటి వైసీపీ పాలనపై ఉన్న వ్యతిరేకతను, ఆరోపణలను ఒక నినాదంగా మార్చింది. దీనికి తోడుగా ప్రజల్లో ఉన్న అసంతృప్తి, మార్పు కోరికలు విజయాన్ని సాధించిపెట్టాయి.

జగన్, కేటీఆర్ ‘పింక్ బుక్’ అనే నినాదాలు ఇప్పుడు ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనేది ఒక కీలక అంశం. వారి పాలనపై విసుగుచెంది లేదా మార్పు కోరుకుని ఓటు వేసిన ప్రజలు, ఈ ‘లెక్కలు సరిచేస్తాం’ అనే అంశాన్ని ఎంతవరకు వీరిని నమ్ముతారనేది చర్చనీయాంశం అవుతోంది.

అయితే ఈ బుక్ పాలిటిక్స్(Politics) ఒక రాజకీయ వ్యూహంగా ఉపయోగపడుతుందే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎన్నికల ముందు రాజకీయాల్లో ఉద్రిక్తతలను పెంచేందుకే ఉపయోగపడుతుందే తప్ప, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపదని పెదవి విరుస్తున్నారు.

ప్రజలు ఆశించేది కక్ష సాధింపులు కాదు, తమ జీవితాలను మెరుగుపరిచే అభివృద్ధి, సంక్షేమం. అందుకే, ఈ ‘బుక్ పాలిటిక్స్’ నినాదంపై ప్రజలు మరోసారి ఎలా స్పందిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button