Vastu: ఇంట్లో గొడవలు,ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అయితే ఈ చిన్న పనులు చేయండి చాలు..
Vastu: వాస్తు శాస్త్రం అనేది కేవలం నమ్మకం కాదు.. అది దిశలు, పంచభూతాలు, అయస్కాంత తరంగాల మధ్య సమతుల్యతను కాపాడే ఒక గొప్ప విజ్ఞానం
Vastu
మనం నివసించే ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండే కట్టడం కాదు. అది మన ఆలోచనలకు, మన శక్తికి ప్రతిబింబం అని తెలుసుకోవాలి. ఒక ఇంట్లోకి వెళ్లగానే మనకు ఎంతో ప్రశాంతంగా అన్పిస్తుంది, అదే మరొక ఇంట్లోకి వెళ్తే తెలియని అసహనం కలుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఆ ఇంట్లో ఉండే వాస్తు(Vastu) , శక్తి ప్రసారం (Energy Flow) అంటారు వాస్తు నిపుణులు.
వాస్తు శాస్త్రం(Vastu) అనేది కేవలం నమ్మకం కాదు.. అది దిశలు, పంచభూతాలు, అయస్కాంత తరంగాల మధ్య సమతుల్యతను కాపాడే ఒక గొప్ప విజ్ఞానం అంటారు నిపుణులు. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. చాలామంది తెలియక చేసే చిన్న చిన్న వాస్తు (Vastu)తప్పులు కుటుంబంలో గొడవలకు, అనారోగ్యానికి , ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయట.
ముఖ్యంగా ఒక ఇంటికి ‘ఈశాన్యం’ (North East) అనేది అత్యంత పవిత్రమైన మూల అని తెలసుకోవాలి. దీనిని దేవతల స్థానంగా భావిస్తారు. ఈ మూల ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా , వెలుతురుతో ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యంలో బరువైన సామాన్లు పెట్టడం, అక్కడ టాయిలెట్ కట్టడం లేదా చెత్త వేయడం వల్ల ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఆగిపోతుంది.

ఇది పిల్లల చదువుపైన, ఇంటి యజమాని ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుంది. ఈ మూలలో చిన్న నీటి కుంట లేదా దేవుని గది, లేదా చిన్న గాజు గిన్నెలో రాక్ సాల్ట్ వేసి ఉండటం ఎంతో మంచిది. అలాగే వంటగది ఎప్పుడూ ‘ఆగ్నేయం’ (South East) లోనే ఉండాలి. ఎందుకంటే ఇది అగ్ని దేవుడి స్థానం. వంట చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి వంట చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది.
ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే, యజమాని గది ఎప్పుడూ ‘నైరుతి’ (South West) మూలలో ఉండాలి. దీనివల్ల కుటుంబంలో స్థిరత్వం,లీడర్షిప్ లక్షణాలు పెరుగుతాయి. మంచం కింద పాత సామాన్లు, ఇనుప వస్తువులు లేదా విరిగిన సామాన్లు అయితే అస్సలు ఉంచకూడదు. ఇది నిద్రలేమికి , మానసిక ఒత్తిడికి కారణమవుతుంది.
అలాగే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎప్పుడూ అద్దం ఉంచకూడదు. ఇది బయట నుంచి వచ్చే శుభ ఫలితాలను వెనక్కి పంపిస్తుందని అంటారు. ఇంటి గుమ్మాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. సాయంత్రం వేళల్లో ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం, ఇంటి గుమ్మం దగ్గర రాగి చెంబుతో నీళ్లు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో విరిగిపోయిన వస్తువులు, పని చేయని గడియారాలు, ఎండిపోయిన మొక్కలు ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
వారానికి ఒకసారి సముద్రపు ఉప్పు కలిపిన నీటితో గదులను శుభ్రం చేయడం వల్ల ఇంటి లోపల ఉన్న నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి. ఇంటి గోడలకు వేసే రంగులు కూడా మన మనస్తత్వంపై ప్రభావం చూపుతాయి. ఎప్పుడూ లేత రంగులు (Light Colors) వాడటం వల్ల ఇల్లు విశాలంగా , ప్రశాంతంగా కనిపిస్తుంది.
వాస్తు (Vastu)అనేది ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అని గుర్తు పెట్టుకోవాలి. మనం నివసించే పరిసరాలను పవిత్రంగా ఉంచుకుంటే, ఆ ప్రకృతి మనల్ని అన్ని విధాలా కాపాడుతుంది. అందుకే ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో సంతోషం, ప్రశాంతత నెలకొని ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి.



