Just SpiritualLatest News

Meenakshi:14 గోపురాల అద్భుతం: మీనాక్షి అమ్మన్ ఆలయం శిల్పకళా వైభవం

Meenakshi: మీనాక్షి అమ్మన్ సాక్షాత్తు పార్వతీ దేవి యొక్క అవతారం. ఈమె మధురై పాలకుడైన మలయధ్వజ పాండ్య రాజుకు జన్మించిందని, తర్వాత శివుడిని వివాహం చేసుకుందని పురాణాలు చెబుతాయి.

Meenakshi

మీనాక్షి అమ్మన్(Meenakshi) ఆలయం శిల్పకళా వైభవం గుురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తమిళనాడులోని మధురైలో ఉన్న ఈ దేవాలయం, ద్రావిడ నిర్మాణ శైలికి ,శిల్పకళను ఎంతో గొప్పగా చూపిస్తుంది. ఈ ఆలయం శివుని రూపమైన సుందరేశ్వర స్వామికి ,ఆయన దేవేరి మీనాక్షి అమ్మన్ (పార్వతీ దేవి) కు అంకితం చేయబడింది.

గోపురాల వైభవం.. ఈ ఆలయం దాని విశాలమైన ఆవరణ, నాలుగు దిక్కులలో ఉండే 14 అద్భుతమైన గోపురాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గోపురాలు వేలకొలది రంగురంగుల హిందూ దేవతా మూర్తుల శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. వీటిలో అత్యంత ఎత్తైన గోపురం సుమారు 170 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఈ దేవాలయం సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇందులో వేల స్తంభాల మండపం (హాలు) ఉంది.

Meenakshi
Meenakshi

ఆలయంలోని బంగారు తామర కొలను (పొత్తమరై కులం) చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది.

చరిత్ర -నమ్మకాలు..
మీనాక్షి జననం.. మీనాక్షి అమ్మన్ సాక్షాత్తు పార్వతీ దేవి యొక్క అవతారం. ఈమె మధురై పాలకుడైన మలయధ్వజ పాండ్య రాజుకు జన్మించిందని, తర్వాత శివుడిని వివాహం చేసుకుందని పురాణాలు చెబుతాయి.

తిరుకల్యాణం.. ప్రతి సంవత్సరం జరిగే మీనాక్షి-సుందరేశ్వర స్వామి వివాహ వేడుక (తిరుకల్యాణం) ఈ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది.

ఒకప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలోనే తమిళ పండితుల మహాసభ (తమిళ సంఘం) జరిగిందని, ఇక్కడి కొలనులో పడని రచనలు నాణ్యత లేనివిగా పరిగణించబడ్డాయని ప్రతీతి.

మీనాక్షి దేవాలయం(Meenakshi) స్త్రీ శక్తి (శక్తి ఆరాధన), ద్రావిడ సంస్కృతికి చిహ్నం. శిల్పకళా అద్భుతాలు, పండుగల వైభవం కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Shadow: 80 టన్నుల ఏకశిలా గోపురం..అయినా నేలపై పడని శిఖరం నీడ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button