Parijata flowers:పారిజాత పుష్పాల రహస్యం.. ఈ పూలను ఎవరూ ఎందుకు కోయరు?
Parijata flowers: స్వర్గం నుంచి భూమిపైకి వచ్చిన ఏకైక వృక్షం పారిజాతం. ఈ పువ్వులు భూమిని తాకిన తర్వాతే మరింత పవిత్రమవుతాయని, అందుకే అవి పవిత్రమైనవని పురాణాలు చెబుతున్నాయి.

Parijata flowers
సాధారణంగా ఏ పూజ చేసినా, పూల కోసం మొక్కల కొమ్మలను వంచి లేదా ఆకులను కత్తిరించి పువ్వులను కోస్తుంటారు. కానీ, ఒక పారిజాత పుష్పం విషయంలో మాత్రం ఈ నియమానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తారు. భూమిపై పడిన పారిజాత పూలతోనే దేవుడిని పూజ చేయాలని మన శాస్త్రాలు ఎందుకు చెబుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, ఈ దివ్య వృక్షం సముద్ర మథనం సమయంలో ఉద్భవించింది. తర్వాత శ్రీ మహావిష్ణువు దీనిని స్వర్గానికి తీసుకువెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దానిని భూలోకానికి తీసుకొచ్చాడు. ఈ విధంగా, స్వర్గం నుంచి భూమిపైకి వచ్చిన ఏకైక వృక్షం పారిజాతం. ఈ పువ్వులు భూమిని తాకిన తర్వాతే మరింత పవిత్రమవుతాయని, అందుకే అవి పవిత్రమైనవని పురాణాలు చెబుతున్నాయి. కిందపడిన పువ్వులను ఆవుపేడతో అలికిన నేల నుంచి ఏరుకుని స్వామికి సమర్పిస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది.

పారిజాత వృక్షానికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. “నా పుష్పాలను(Parijata flowers) ఎవరూ కోయకూడదు, నేను తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి” అని వరం పొందిందని చెబుతారు. అందువల్లే, పారిజాతం తన పుష్పాల(Parijata flowers)ను స్వయంగా నేలపై రాలిస్తేనే అవి పవిత్రమైనవిగా భావిస్తారు. కేవలం రాత్రి పూట మాత్రమే వికసించే ఈ పువ్వులు, ఉదయం తెల్లవారేసరికి రాలిపోతాయి. వీటిని పూజలో ఉపయోగించడం ద్వారా ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయని పురాణ వచనం.
పారిజాత పుష్పాని(Parijata flowers)కి పంచస్పర్శ మహిమ అని ఒక ప్రత్యేకత ఉంది. ఇది భూమి, మృత్తిక (మట్టి), జలం, హస్తం, చివరగా స్వామి స్పర్శను పొందుతుంది. ఈ ఐదు పవిత్ర స్పర్శలతో కూడిన పారిజాతం పుష్పం(Parijata flowers) భక్తుల పంచమహా పాతకాలను సైతం తొలగిస్తుందని ప్రతీతి. అందుకే పారిజాత పుష్పాలు కిందపడినవే అత్యంత పవిత్రమైనవి, పూజకు ఉత్తమమైనవి. అయితే, ఎరుపు రంగు పారిజాత పుష్పాలను విష్ణు ఆరాధనకు వాడరాదని చెబుతారు. ఎందుకంటే ఎరుపు రంగు తమోగుణానికి ప్రతీక కాగా, విష్ణువు సత్వగుణ స్వరూపుడు. శ్రీ పారిజాత పుష్ప సమర్పణం సమస్త మంగళాలను ప్రసాదిస్తుంది. ఈ పుష్పం భగవంతుని అనుగ్రహానికి ఒక దివ్య ద్వారం.