Tirumala: ఇకపై తిరుమలలో వారికి నో ఎంట్రీ..
Tirumala: తిరుమలలో రీల్స్, డ్యాన్సులు, ఫన్నీ వీడియోలపై టీటీడీ తీవ్ర చర్యలు! ఆలయ పవిత్రతను కాపాడేందుకు స్ట్రిక్ట్ రూల్స్ అమలులోకి.

Tirumala
ఈ మధ్య చాలామంది దేవాలయాలకు వెళ్లి కూడా ఫేమస్ అవుదామని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ట్రెడిషనల్ ఫోటోలు కాకుండా వీడియోలు, డ్యాన్సులు చేసి, వీటిని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు.
చివరకు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిక దర్శనానికి తిరుమల(Tirumala)కు వచ్చిన చాలామంది భక్తులు కూడా ఇదే చేస్తున్నారు. ఆలయానికి ముందు, మాడ వీధుల్లో డ్యాన్సులు చేస్తూ, ఫన్నీ రీల్స్(Social Media Reels) తీస్తూ ఫేమస్ అవుతున్నారు. ఇది వారికి ఓ సరదాగా అనిపించినా మిగిలిన భక్తులకు మాత్రం అసహనానికి గురి చేస్తుంది.
తిరుమల(Tirumala)కు వేలాది మంది భక్తులు దీక్షతో, ఆధ్యాత్మిక భావంతో వస్తారు. ఇలా పబ్లిక్ ప్లేస్‌లో డ్యాన్సులు, ఫన్నీ వీడియోలు,ఫోటో షూట్స్ తీసి వైరల్ చేయడం వల్ల, అక్కడ ఉన్న భక్తులకు ఇబ్బంది కలుగుతోంది. శాంతాన్నిచ్చే దేవ దేవుడి స్థలాన్ని ట్రెండ్ కలర్లో చూపడం కొన్ని కాసేపు సోషల్ మీడియాలో గుర్తింపు ఇస్తుంది. కాని అక్కడికెళ్లిన వారి ఆధ్యాత్మిక (Devotion)అనుభూతి మాయం అవుతుండటంతో.. అక్కడి భక్తులు ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకుని వెళ్లారు.

దీంతో రంగంలోకి దిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు దీనికి చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి వీడియోలు, డ్యాన్సులు, వెకిలి చేష్టలు చేసే వారిని గుర్తించగానే సెక్యూరిటీ వెంటనే యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించారు. అవసరమైతే ఇలాంటివారిపై కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.
తిరుమల(Tirumala)లోని పేరు, పవిత్రతను చెడగొట్టే ఎలాంటి పనులను తాము ఎంకరేజ్ చేయమని టీటీడీ అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా ఇకపై రీల్స్ ,వీడియోలు తీసి ఫేమస్ అవుదామనుకున్న వారంతా తిరుమలకు వెళ్లే ముందు అక్కడి రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయన్న సంగతి తెలుసుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
Also Read: Rahul : మోదీ డిఫెన్స్.. రాహుల్ ఆఫెన్స్.. ఏం జరిగింది మోదీజీ ?
Indus waters: నెహ్రూ చేసిన ఆ తప్పేంటి? మోదీ ప్రభుత్వం వాదనేంటి ?