Visalakshi Devi :విశాలాక్షి దేవి శక్తిపీఠం ..కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి దేవి ఒకే చోట దర్శనం!
Visalakshi Devi :ఆదిశంకరాచార్యుల కాలం నుంచి కాశీలో నివసించే వారికి విశాలాక్షి ఒక ఆత్మబంధువుగా, ప్రాణస్థానంగా ఉన్నారు.

Visalakshi Devi
పవిత్ర గంగా నది ఒడ్డున, పురాతన కాశీ నగరంలో వెలసిన విశాలాక్షి దేవి(Visalakshi Devi) ఆలయం ఒక పవిత్రమైన శక్తిపీఠం. పురాణాల ప్రకారం, సతీదేవి శరీరంలోని ఎర్ర చెవి భాగం లేదా కనులు ఇక్కడ పడినట్లు చెబుతారు. అందుకే అమ్మవారిని “విశాలాక్షి” (విశాలమైన కళ్లు ఉన్న తల్లి) అని పిలుస్తారు. యుగయుగాలుగా కాశీకి లక్ష్మీ కళ్యాణం, సౌభాగ్యం, తాంత్రిక వైభవానికి ఈ ఆలయం కేంద్రంగా ఉంది. ఆదిశంకరాచార్యుల కాలం నుంచి కాశీలో నివసించే వారికి విశాలాక్షి ఒక ఆత్మబంధువుగా, ప్రాణస్థానంగా ఉన్నారు.
చారిత్రిక విశిష్టత & పురాణ ప్రాధాన్యత..ఈ శక్తిపీఠం తాంత్రిక, వైదిక , శాక్తేయ సంప్రదాయాల కలయికకు ఒక ప్రతీక. విశాలాక్షి(Visalakshi Devi)ని పూజిస్తే విద్య, జ్ఞానం, సంతానం లభిస్తాయని భక్తుల నమ్మకం. నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు పితృ కార్యాలను కూడా నిర్వర్తిస్తారు.

విశాలాక్షి ఆలయం కాశీ విశ్వనాథ ఆలయానికి చాలా దగ్గరగా ఉంది, ఇది భక్తులకు రెండు ఆలయాలను ఒకేసారి దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఆలయం గంగా నదిలో ఉన్న మీర్ ఘాట్ ఒడ్డున ఉంటుంది. ఉదయం గంగానదిలో స్నానం చేసి, విశాలాక్షిని దర్శించుకోవడం అనేది భక్తులకు ఒక గొప్ప అనుభూతి.
వారణాసిలో మీర్ ఘాట్ దగ్గర ఈ ఆలయం ఉంది. వారణాసి రైల్వే స్టేషన్, విమానాశ్రయం నుంచి టాక్సీలు, ఆటోలు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం చుట్టుపక్కల అనేక హోటళ్లు మరియు వసతి గృహాలు ఉన్నాయి.