Sri Krishna Janmashtami: ఆగస్టు 16 శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఎందుకు జరుపుకోవాలి
Sri Krishna Janmashtami:జన్మాష్టమి రోజున చాలామంది తమ ఇంట్లో శ్రీ కృష్ణుడి ప్రతిమను పెట్టుకుని పూజలు చేస్తారు.

Sri Krishna Janmashtami
శ్రావణ మాసం అంటేనే పండుగలకు పెట్టింది పేరు. ఆ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఈసారి ఆగస్టు 16న జరుపుకోబోతున్నాం. శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలో, కృష్ణ పక్షం అష్టమి తిథి నాడు, రోహిణి నక్షత్రంలో జన్మించాడు. పురాణాల ప్రకారం, ఇదే రోజున శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు. ఆకాశవాణి పలికిన అష్టమ సంతానంతో కంసుడి మరణం తప్పదని ఈ పర్వదినం గుర్తు చేస్తుంది. అందుకే ఈ పండుగకు అంత విశిష్టత
కంసుడిని హతమార్చేందుకు శ్రీకృష్ణుడు(Sri Krishna Janmashtami) జన్మించాడు. కానీ, కంసుడి భయంతో వసుదేవుడు తమ బిడ్డను యశోద, నందుల దగ్గరకు గోకులానికి తీసుకెళ్లి వారి పొత్తిళ్లలో పెట్టి వస్తారు. వసుదేవుడు కృష్ణుడికి జన్మనిచ్చిన తండ్రి కాగా, నందుడు, యశోదలు ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు. గోకులం చేరిన తర్వాత, కృష్ణుడు తన బాల్య లీలలతో నందుడి ఇల్లు, ఆ ఊరిలో ఉన్న వారందరి మనసులను గెలుచుకున్నాడు. అనేక మంది రాక్షసులను హతమార్చి, చివరికి కంసుడిని కూడా సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించాడు.
శ్రీకృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ధర్మం, సత్యం, న్యాయాలకు ప్రతీకగా నిలుస్తాడు. మహాభారత యుద్ధంలో పాండవులు కృష్ణుడిని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్లారు. కౌరవుల వైపు అసంఖ్యాకమైన యోధులు ఉన్నా, పాండవులు సత్యాన్ని, శ్రీ కృష్ణుడి సన్మార్గాన్ని మాత్రమే అనుసరించారు. అందుకే, ఆలస్యమైనప్పటికీ పాండవులు విజయం సాధించి, కష్టాల నుంచి బయటపడ్డారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన సన్మార్గాన్ని అనుసరిస్తే, మానవ జీవితం సుసంపన్నం అవుతుందని పండితులు చెబుతుంటారు.

జన్మాష్టమి (Sri Krishna Janmashtami) రోజున చాలామంది తమ ఇంట్లో శ్రీ కృష్ణుడి ప్రతిమను పెట్టుకుని పూజలు చేస్తారు. ఈ రోజు ముఖ్యంగా 56 రకాల నైవేద్యాలను సమర్పించుకుంటారు. దీన్నే ఛప్పన్ భోగ్(Chappan Bhog) అని కూడా అంటారు. భక్తితో చేసే ఈ పూజల తర్వాత, చాలా చోట్ల ఉట్టికొట్టే సంప్రదాయం కూడా ఉంటుంది. భక్తులు తమ పిల్లలకు కృష్ణుడి వేషధారణ వేసి మురిసిపోతారు. శ్రీ కృష్ణుడి పుట్టిన రోజున ఈ పండుగ(Krishna Janmashtami)ను ఎంతో భక్తి పారవశ్యంతో, ఆనందంగా జరుపుకుంటారు.
Also Read: Goddess Varahi : రాత్రిపూట పూజలందుకునే వారాహి దేవి..ఆరాధన వెనుక రహస్యం