Australia vs England: తొలిరోజే 20 వికెట్లు.. బాక్సింగ్ డే టెస్టులో బౌలర్ల హవా
Australia vs England: ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసామంటూ ఎంతో ఉత్సాహంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఆరంభం నుంచే షాక్ మీద షాక్ తగిలింది.
Australia vs England
యాషెస్ సిరీస్ లో ఈ సారి బౌలర్ల హవా ప్రతీ మ్యాచ్ లోనూ కనిపిస్తోంది. మొదటి టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసిపోగా ఇప్పుడు మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు(Australia vs England) కూడా అదే దారిలో సాగుతోంది. తొలిరోజే ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్ లు ముగిసిపోయాయి. ఇప్పటికే సిరీస్ ను 3-0తో ఆసీస్ సొంతం చేసుకున్న వేళ మెల్ బోర్న్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పేస్‌కు అనుకూలించడంతో ఇంగ్లీష్ బౌలర్లు అదరగొట్టారు.
ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించిన ఆస్ట్రేలియా (Australia vs England)34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. టాపార్డర్ మొత్తం చేతులెత్తేయడంతో 91 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుంది. కామెరూన్ గ్రీన్ కాసేపు నిలకడగా ఆడి ఆదుకునేలా కనిపించాడు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆ వెంటనే ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ పెవిలియన్ చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. దాంతో ఆసీస్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. టంగ్ ఐదు వికెట్లు , అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసామంటూ ఎంతో ఉత్సాహంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఆరంభం నుంచే షాక్ మీద షాక్ తగిలింది. ఇంగ్లీష్ బ్యాటర్లు ఆసీస్ కంటే ఘోరంగా బ్యాటింగ్ చేశారు పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కంగారూ బౌలర్లు మరింత రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చేతులెత్తేసింది. కేవలం 8 పరుగులకే ఇంగ్లాండ్ 3 కోల్పోయింది.
అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలవలేకపోయాడు. ఆసీస్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. హ్యారీ బ్రూక్ 41 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 100 లోపే ముగిసేలా కనిపించింది. అయితే చివర్లో ఆట్కిన్సన్ బ్యాట్ తో రాణించి ఆదుకున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 110 పరుగులైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4 వికెట్లు, బొలాండ్ 3, మిచెల్ స్టార్క్ 2, కామెరూన్ గ్రీన్ 1 వికెట్ తీసారు.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 42 పరుగుల ఆధిక్యం దక్కింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బౌలర్ల హవా కొనసాగుతున్న ఈ (Australia vs England)మ్యాచ్ లో నాలుగో ఇన్నింగ్స్ లో 200 ప్లస్ రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.



