Just SportsLatest News

Cricket: బౌలింగ్ సత్తా ఇంతేనా ? సొంత గడ్డపై భారత బౌలర్ల ఫ్లాప్ షో

Cricket: రాంచీ వన్డేలో వికెట్ తీయకపోగా 9 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు రాయ్ పూర్ వన్డేలోనూ వికెట్ తీయలేదు.

Cricket

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్(Cricket) భారత బలహీనతలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది. ప్రతీసారీ బ్యాటర్లే మ్యాచ్ లు గెలిపించలేరన్న మాట నిజమవుతోంది. తొలి వన్డే(Cricket)లో అతికష్టంతో గట్టెక్కిన టీమిండియా రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా మన బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా అందరూ చేతులెత్తేశారు. అర్షదీప్ సింగ్ ఒక్కడే కాస్త పర్వాలేడనిపించాడు.

హర్షిత్ రాణా 10 ఓవర్లలో స్పెల్ లో 1 వికెట్ తీసి 70 రన్స్ ఇచ్చాడు. అలాగే కుల్దీప్ యాడవ్ 10 ఓవర్లకు 78 రన్స్ ఇచ్చుకున్నాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2 వికెట్లు తీసినప్పటికీ 8.2 ఓవర్లలో ఏకంగా 86 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి వన్డేలో కూడా 7.2 ఓవర్లు వేసి 48 రన్స్ ఇచ్చేశాడు. ఇక సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం ప్రభావం చూపించలేకపోతున్నాడు.

రాంచీ వన్డేలో వికెట్ తీయకపోగా 9 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు రాయ్ పూర్ వన్డేలోనూ వికెట్ తీయలేదు. ఇలాంటి బౌలింగ్ తో విజయాలు ఆశించడం అత్యాశే అవుతుందని పలువురు మాజీలు తేల్చేస్తున్నారు.

మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే మన బౌలర్లపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఇలాంటి బౌలింగ్ ఉంటే 500 టార్గెట్ అయినా కాపాడుకోలేపోమంటూ వ్యాఖ్యానించారు. బ్యాటర్లు ఇంకాస్త ఎక్కువ రన్స్ చేస్తే బాగుండేదనుకోవడం సరైనది కాదన్నారు. అలా అయితే ప్రతీ మ్యాచ్లో 400 ప్లస్ కొట్టాలా అంటూ ప్రశ్నించారు. ఒక మ్యాచ్ గెలవాలంటే బ్యాటర్లు మాత్రమే కాకుండా బౌలింగ్ లోనూ రాణించాలని స్పష్టం చేశారు.

రాయ్ పూర్ లో మంచు ప్రభావం కూడా భారత్ కు ప్రతికూలంగా మారిందన్న విషయాన్ని ఏకీభవిస్తూనే పూర్తిగా దానినే ఓటమికి సాకుగా చూపలేమన్నారు. ఇదిలా ఉంటే సిరీస్ డిసైడర్ గా మారిన చివరి వన్డే విశాఖ వేదికగా శనివారం జరుగుతుంది.

Cricket
Cricket

టాస్ సంగతి పక్కన పెడితే బౌలింగ్ బాగుంటే ఛేజింగ్ పిచ్ పై సైతం ప్రత్యర్థిని కట్టడి | చేయొచ్చన్నది ఎన్నోసార్లు రుజువైంది. అందుకే బౌలర్లు గాడిన పడితే తప్ప వన్డే సిరీస్ లో భారత్ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే విశాఖ పిచ్ కూడా ఛేజింగ్ కే అనుకూలం. అలాంటప్పుడు టాస్ గెలవడం ఖచ్చితంగా కీలకం కాబోతోంది. టాస్ ఎవరి చేతుల్లోనూ ఉండదు కాబట్టి బౌలర్లు మాత్రం ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. బౌలింగ్ కోచ్ గా ఉన్న మోర్నే మోర్కెల్ బౌలర్లపై మరింత ఫోకస్ చేయాలని సూచించాడు.

ఈ నేపథ్యంలో తుది జట్టు(Cricket)లో మార్పులకు అవకాశముంది. రెండో వన్డేలో పంత్ ను తీసుకుంటారని అనుకున్నా అదేమీ జరగలేదు. అయితే చివరి వన్డేకు మాత్రం వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో పంత్ ను తీసుకునే ఛాన్సుంది. వాషింగ్టన్ సుందర్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్ తోనూ ఆకట్టుకోలేకపోయాడు. అలాగే పేలవ బౌలింగ్ తో నిరాశపరుస్తున్న ప్రసిద్ధ కృష్ణను తీసుకుంటారని భావిస్తున్నారు. అతని స్థానంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కుతుండేమో చూడాలి.

నితీశ్ జట్టులోకి వస్తే బౌలింగ్ ఆప్షన్ ఉండడంతో పాటు బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ రెండో వన్డేలో సెంచరీ చేయడంతో అతని స్థానానికి డోకా లేదు. మొత్తం మీద సాగర తీరాన జరగబోయే సిరీస్ డిసైదర్లో ఎవరు చేయి సాధిస్తారో చూడాలి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button