IPL 2026: చెన్నై ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సంజూ కోసం జడేజాకు గుడ్ బై
IPL 2026: సీఎస్కేలో ధోనీ తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్‌గా జడేజాకు పేరుంది. చాలాసార్లు చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
IPL 2026
ఐపీఎల్(IPL) చరిత్రలో మరో ఆసక్తికరమైన ట్రేడింగ్ జరగబోతోంది. ఈ ట్రేడింగ్ డీల్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సీఎస్కేలో ఎప్పటినుంచో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న రవీంద్ర జడేజాకు ఆ ఫ్రాంచైజీ వీడ్కోలు పలకబోతోంది. రాజస్తాన్ రాయల్స్ తో డీల్ ఓకే అయితే జడేజాతో పాటు సామ్ కరన్ ను కూడా చెన్నై వదిలేస్తుంది. గత కొన్ని రోజులుగా సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని వీడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.
వచ్చే సీజన్ నుంచి సంజూ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడబోతున్నాడు. మినీ వేలానికి ముందు దీనికి సంబంధించిన ట్రేడింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రెండు ఫ్రాంచైజీల మధ్య చర్చలు దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. సంజూకు బడులుగా చెన్నై ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా సామ్ కరన్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనే మిగిలిఉంది. అయితే ప్లేయర్స్ నిర్ణయం కూడా తెలియాల్సి ఉంది. ఈ డీల్ జరిగితే నిజంగానే పెద్ద సంచలనంగా మారనుంది. ఎందుకంటే జడేజా చెన్నైకి, సంజూ రాజస్థాన్ కు సుదీర్ఘకాలంగా ఆడుతున్నారు. తమ జట్లలో వీరిద్దరూ మ్యాచ్ విన్నర్లు కూడా. అలాంటి ప్లేయర్స్ ను ఈ విధంగా ట్రేడ్ చేసుకోవడం ఆయా ఫ్రాంచైజీలకు షాకింగ్ గానే చెప్పాలి.

సీఎస్కేలో ధోనీ తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్ గా జడేజాకు పేరుంది. చాలాసార్లు చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు గత సీజన్ నుంచీ నంజూకూ, రాయల్స్ కు మధ్య సంబంధాలు చెడినట్టు తెలుస్తోంది. గత సీజన్ లో పలుసార్లు సంజూను ఫైనల్ ఎలెవన్ లో ఆడించకపోవడం, బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చడం వంటి పరిస్థితులే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈ కారణంగానే తన పాత ఫ్రాంచైజీకి సంజూ గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఇంతకుముందే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు అదే నిజమవుతూ ట్రేడింగ్ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా గత సీజన్ కు ముందు చెన్నై రూ.18 కోట్లతో జడేజాను, రాజస్థాన్ రాయల్స్ రూ.18 కోట్లతో సంజూ శాంసన్ ను రిటైన్ చేసుకున్నాయి. చెన్నై జట్టులోకి సంజూ వెళితే ఆ ఫ్రాంచైజీ తరపున ఆడనుండడం అదే తొలిసారి అవుతుంది. మరోవైపు ఐపీఎల్(IPL) ఆరంభ సీజన్ లో రాజస్థాన్ ఛాంపియన్ గా నిలిచినప్పుడు జడేజా అదే ఫ్రాంచైజీలో ఉన్నాడు. 2009 సీజన్ లోనూ రాయల్స్ కే ఆడిన జడేజా 2010 నుంచి ఇప్పటి వరకూ చెన్నై సూపర్ కింగ్స్ కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.



