Just SportsLatest News

T20: ఇక టీ ట్వంటీ యుద్ధం.. మిషన్ వరల్డ్ కప్ పై ఫోకస్

T20: వరల్డ్ కప్ కోసం ఎంపికయ్యే జట్టులో చోటు ఆశిస్తున్న ప్లేయర్స్ అందరికి ఇదే చివరి ఛాన్స్. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో మ్యాచ్ విన్నర్స్ గా నిలిచే ఆల్ రౌండర్ కోటాలో పలువురు రేసులో ఉన్నారు.

T20

సౌతాఫ్రికా చేతి లో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా తర్వాత వన్డే సిరీస్ విజయంతో రివేంజ్ తీర్చుకుంది ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ లో సైతం సఫారీలను చిత్తు చేసే లక్ష్యంతో ముమ్మరంగా సాధన చేస్తోంది. మంగళవారం కటక్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీట్వంటీ జరగబోతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు వచ్చే టీ ప్రపంచకప్ కోసం ఫైనల్ కాంబినేషన్ ను రెడీ చేసుకునే పనిలో ఉంది. మెగా టోర్నీకి ముందు భారత్ ఇంకా 10 మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది.

ఈ(T20) సిరీస్ లో జరిగే ఐదు మ్యాచ్ లతో ప్రపంచకప్ కు భారత జట్టు దాదాపుగా ఖరారయ్యే అవకాశముంది. ఇప్పటికే 10 మంది పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. అయితే మిగిలిన ఐదు స్థానాల కోసం కనీసం 10 మంది రేసులో నిలిచారు. తన సత్తా నిరూపించుకునేందుకు వారికి ఈ సిరీసే కీలకం కాబోతోంది.

ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ కు ఎంపిక చేయబోయే జట్టే టీ 20 వరల్డ్ కప్(T20) లో ఆడుతుందని చెప్పొచ్చు. దీంతో వరల్డ్ కప్ కోసం ఎంపికయ్యే జట్టులో చోటు ఆశిస్తున్న ప్లేయర్స్ అందరికి ఇదే చివరి ఛాన్స్. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో మ్యాచ్ విన్నర్స్ గా నిలిచే ఆల్ రౌండర్ కోటాలో పలువురు రేసులో ఉన్నారు.

T20
T20

ఇదిలా ఉంటే సౌతాఫ్రికాతో జరిగే తొలి టీట్వంటీ (T20)కోసం తుది జట్టు కూర్పే సవాల్ గా మారింది. బ్యాటర్ల విషయంలోకాకున్నా ఆల్ రౌండర్ల ఎంపికపై కోచ్ గంభీర్ తర్జన భర్జన పడుతున్నాడు. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లలో ఒకరికే చోటు దక్కనుంది. కటక్ లో రెడ్ సాయిల్ పిచ్ సిద్ధం చేస్తుండడంతో చేసిద్దం స్పిన్నర్లతో పోలిస్తే పేసర్లకే అడ్వాంటేజ్ ఉంటుంది.

దీని ప్రకారం చూస్తే దూబేకు చోటు దక్కొచ్చు. అలాగే తుది జట్టులోకి హార్థిక్ పాండ్యా రీ ఎంట్రీతో బ్యాటింగ్ డెప్త్ మరింత పెరిగింది. ఇక వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు అతను ఫిట్ నెస్ సాధించినట్టు కోచ్ గంభీర్ కూడా క్లారిటీ ఇవ్వడంతో అభిషేక్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. దీంతో నంజూ శాంసన్ మిడిలార్డర్ లోనే ఆడాల్సి ఉంటుంది.

సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ కు దిగనున్నారు. స్పిన్ విభాగంలో కుల్లీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బరిలోకి దిగుతాడు. ఇదిగా ఉంటే పేస్ విభాగంలో వన్డే సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్న బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్ కీలకం కాబోతున్నారు. మరో పీనర్ హర్షిత్ రాణాకు కూడా చోటు దక్కనుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button