Team India: గెలిస్తేనే పరువు దక్కేది.. రెండో టెస్టుకు భారత్ రెడీ
Team India: వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఒత్తిడంతా భారత్ పైనే ఉంది.
Team India
ఈడెన్ గార్డెన్స్ లో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు రెడీ అయింది. గుహావటి వేదికగా శనివారం నుంచి జరగబోయే మ్యాచ్ భారత్ (Team India)కు చావో రేవో . ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ ను సమం చేసి పరువు దక్కించుకుంటుంది. ఒకవేళ ఓడినా, డ్రాగా ముగిసినా సొంతగడ్డపై మరో సిరీస్ ఓటమి భారత్ (Team India)ఖాతాలో చేరుతుంది.
అదే సమయంలో కెప్టెన్ శుభమన్ గిల్ మ్యాచ్ కు దూరమవడం మరో ఎదురుదెబ్బగానే చెప్పాలి. దీంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఒత్తిడంతా భారత్ (Team India) పైనే ఉంది.
రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు ఎంపిక సవాల్ గా మారింది. గిల్ స్థానంలో నితీశ్ రెడ్డి జట్టులోకి వచ్చినా… నలుగురు స్పిన్నర్లలో ఒకరిని తప్పించడం ఖాయమైంది. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి రానున్నాడు. అయితే సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. నాలుగో ప్లేస్ లో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి.

బ్యాటింగ్ కోచ్ ఇచ్చిన హింట్ ప్రకారం ధృవ్ జురెల్ గిల్ ఆడే స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. అటు బ్యాటర్లు రెండో టెస్టులో ఖచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఉంది. తొలి టెస్టులో ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణం. దీంతో ఓపెనర్లతో పాటు మిడిలార్డర్ పైనా ఒత్తిడి నెలకొంది. బౌలింగ్ లో బుమ్రా, సిరాజ్ పేస్ ఎటాక్ లో ఉండగా.. స్పిన్నర్లుగా జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లపైనే భారం ఉంది.
ఇదిలా ఉంటే కోల్ కత్తా టెస్టులో భారత్ (Team India)కు షాకిచ్చిన సౌతాఫ్రికా ఫుల్ జోష్ లో ఉంది. ఎందుకంటే భారత్ టూర్ కు వచ్చినప్పుడు సఫారీలపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే టీమిండియాలో టెస్ట్ గెలిచి 15 ఏళ్ళు దాటిపోయింది. దీంతో సౌతాఫ్రికా పోటీ ఇస్తే గొప్ప అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే ఈడెన్ టెస్టులో తక్కువ స్కోరుకే ఆలౌటై, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడా సమర్పించుకుని మ్యాచ్ గెలిచిందంటే దానికి కారణం బౌలర్ల ప్రతిభే. బ్యాటింగ్ లో కెప్టెన్ బవుమా కీలక ఇన్నింగ్స్ కూడా వారి విజయానికి కారణమైంది.
పిచ్ కు తగ్గట్టుగా జట్టును ఎంపిక చేసుకుని ఈడెన్ లో సౌతాఫ్రికా గెలిచింది. రెండో టెస్టుకు ఎర్రమట్టితో కూడిన పిచ్ ను రెడీ చేశారు. దీని ప్రకారం ఆరంభంలో రెండు రోజులు పేసర్లకు, తర్వాత కాస్త బ్యాటర్లకు, చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గుహావటిలో ఉన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా సూర్యుడు త్వరగా ఉదయిస్తాడు. దీంతో మ్యాచ్ 9 గంటలకే ప్రారంభమవుతుంది. అలాగే లంచ్ బ్రేక్ కు ముందే టీ బ్రేక్ ఇవ్వనున్నారు.




One Comment