Just SportsLatest News

WI vs ZIM : ఊచకోత.. ఇది విండీస్ ఊచకోత…జింబాబ్వేను చిత్తు చేసిన కరేబియన్లు

WI vs ZIM :జింబ్వాబ్వేతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా హెట్ మెయిన్ జింబాబ్వే బౌలర్లను ఊతకోత కోశాడు. అతనితో పాటు పావెల్ కూడా రెచ్చిపోయాడు.

WI vs ZIM

టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందో కరేబియన్ టీమ్ రుచి చూపించింది. జింబ్వాబ్వేతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్(WI vs ZIM) బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా హెట్ మెయిన్ జింబాబ్వే బౌలర్లను ఊతకోత కోశాడు. అతనితో పాటు పావెల్ కూడా రెచ్చిపోయాడు. ఫలితంగా విండీస్ ప్రపంచకప్ లోనే అత్యధిక స్కోరు నమోదైంది. పవర్ హిట్టింగ్ కు మారుపేరైన కరేబియన్ బ్యాటింగ్ లైనప్ లో హెట్ మెయిర్ ఇన్నింగ్సే హైలెట్ గా నిలిచింది.

దాదాపు ప్రతీ ఓవర్ కూ సిక్సర్ లేదా బౌండరీ బాదాడంటే అతని ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కొడితే సిక్సర్ లేకుంటే ఫోర్ అన్న తరహాలో హెట్ మెయిర్ విధ్వంసం సాగింది. అతనికి రోవ్ మన్ పావెల్ కూడా జతకలిసాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 52 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. వీరిద్దరి విధ్వంసానికి బౌలింగ్ వేయాలంటేనే జింబాబ్వే బౌలర్లు భయపడ్డారు.

నిజానికి పవర్ ప్లేలో జింబాబ్వే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ హెట్ మెయిర్ క్రీజులోకి వచ్చిన తర్వాత పూర్తిగా లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయారు. మొదట స్పిన్నర్లను బాదేసిన హెట్ మెయిర్ తర్వాత ఫాస్ట్ బౌలర్లక చుక్కలు చూపించాడు.

సికందర్ రజా బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాదిన హెట్ మెయిక్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. అటు రోవ్‌మన్ పావెల్ 29 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. 34 బంతుల్లో 85 పరుగులు చేయాగా.. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్ లో విండీస్ ఇన్నింగ్స్ కు సంబంధించి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

WI vs ZIM
WI vs ZIM

వెస్టిండీస్ చేసిన 254/6 పరుగులు ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. నిజానికి విండీస్ తొలి 10 ఓవర్లలో 115 రన్స్ చేయగా..చివరి పది ఓవర్లలో 139 పరుగులు చేసింది.తర్వాత ఛేజింగ్ లో జింబాబ్వే చేతులెత్తేసింది. భారీ టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బ్రాడ్ ఈవెన్స్ 43 , మేయర్స్ 28, సికిందర్ 27 తప్పిస్తే మిగిలిన వారంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో జింబాబ్వే 147 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్(WI vs ZIM) 100 ప్లస్ రన్స్ తేడాతో గెలవడంతో వారి రన్ రేట్ కూడా బాగా మెరుగైంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button