Cut-out police: స్పీడ్‌గా దూసుకుపోతున్నారా? కటౌట్ కానిస్టేబుళ్లున్నారు జాగ్రత్త..
Cut-out police: కటౌట్ పోలీసులతో ప్రమాదాలు కట్..పోలీసుల నయా స్కెచ్ అదుర్స్

Cut-out police
ఆదిలాబాద్‌లో స్పీడ్ మీద బ్రేక్ వేయించడానికి జిల్లా పోలీస్ వ్యవస్థ కాస్త నయా స్కెచ్ వేసింది. రోడ్లపై లెక్కలేనట్లుగా దూసుకెళ్తున్న బైక్‌లు, బస్సులు, కార్ల వెనక ట్రెండింగ్ ఆలోచనతో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఏకంగా కటౌట్ స్కెచ్ వేసారు. దీంతో నిజంగా డెడ్‌లీ యాక్సిడెంట్ ప్రాణాలు తీసిన చోటల్లా కనిపించే “లైఫ్ సెవింగ్ ట్రిక్ అన్న పొగడ్తలు వినిపిస్తున్నాయి.
జాతీయ రహదారి 44పై గుడిహత్నూర్‌లోని మేకలగండి, నేరడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్ వద్ద… ఎక్కడైతే ప్రమాదాల బారిన పడి జనాలు బలయ్యారో.. అక్కడే పోలీసులు ఇప్పుడు కటౌట్ కానిస్టేబుళ్లతో వాహనదారులకు మైండ్ సెటప్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

వాహనదారులు పోలీస్ వాహనాలు కనిపించగానే బ్రేకులు వేస్తారు. కానిస్టేబుల్ కదిలితే హెల్మెట్ వేస్తారు. స్పీడ్ తగ్గిస్తారు. ఇదే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. దీనికి చెక్ పెట్టడానికి ఎస్పీ అఖిల్ మహాజన్(Akhil Mahajan IPS) రంగంలోకి దిగి సక్సెస్ అయ్యారు. వాహనదారుల స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని.. కనీసం కటౌట్ పోలీసుల(cut-out police)ను చూసి స్పీడ్ తగ్గించి ప్రాణాలు దక్కితే చాలని చెబుతున్నారు.

మొత్తంగా ఆదిలాబాద్(Adilabad) పోలీసులు చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం.. ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు కూడా రోల్‌మోడల్ అవ్వాలని అక్కడి వారు కోరుకుంటున్నారు.ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు చేసిన పనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.