Just TelanganaJust Andhra PradeshLatest News

Chandrababu:హైటెక్ సిటీ అభివృద్ధి వెనుక అసలు కథ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి వెలుగులోకి చంద్రబాబు కృషి

Chandrababu: 1990ల చివరిలో దేశమంతా ఐటీ రంగంలో దూసుకుపోతున్న సమయంలో, అప్పటి ఐటీ హబ్‌గా ఉన్న బెంగళూరుకు పోటీగా హైదరాబాద్‌ను నిలబెట్టాలని చంద్రబాబు భావించారు.

Chandrababu

హైటెక్ సిటీ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu). హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చాలన్న ఆయన కల, నేడు తెలంగాణకు ఒక పెద్ద ఆస్తిగా మారింది. దశాబ్దాల క్రితం ఆయన వేసిన పునాదుల వల్లనే నేడు హైదరాబాద్ దేశంలోనే అగ్రగామి టెక్ నగరంగా నిలిచింది. ఇదే విషయాన్ని 2025 ఆగస్టు 16న జరిగిన CREDAI ప్రాపర్టీ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రశంసించడం హాట్ టాపిక్ అయింది.

హైటెక్ సిటీ అభివృద్ధి శ్రేయస్సు పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నాయుడికే చెందుతుంది. ఆయన ఊహించి, ఆ పనిని ప్రారంభించకుండా ఉండి ఉంటే హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండేది కాదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేసుకున్నారు . నిజమే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా..హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చడంలో చంద్రబాబు నాయుడు కృషి ఉందంటూ..రాజకీయ , పారిశ్రామిక వర్గాల్లో చర్చించకుంటున్నారు.

1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన చర్యలు ఒక దశాబ్దంలోనే నగరం రూపురేఖలను మార్చేశాయి. 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయితో కలిసి సైబర్ టవర్స్‌ను ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టం. దీంతో మాదాపూర్, మీర్‌పేట్ ప్రాంతాలు ‘సైబరాబాద్‌’గా పిలవబడ్డాయి. ఈ విజన్‌కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, ఐటీ పార్కులు, రహదారులు, అంతర్జాతీయ హోటళ్ల అభివృద్ధికి ఆయన పెద్ద పీట వేశారు.

అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడి దార్శనికత అద్భుతమైనది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను స్వయంగా కలిసి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. దీని ఫలితంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. అంతర్జాతీయ సదస్సులు, దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో హైదరాబాద్‌ను “ఏషియా డిజిటల్ నెర్వ్ సెంటర్”గా ఆయన పరిచయం చేశారు.

Chandrababu-revanthreddy
Chandrababu-revanthreddy

చంద్రబాబు నాయుడు (Chandrababu) పాలనలో తీసుకొచ్చిన విధానాలు హైదరాబాద్‌ అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచాయి. పరిశ్రమలకు తక్కువ పన్నులు, టాక్స్ ప్రోత్సాహాలు, ఐటీ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ-యూనివర్సిటీ భాగస్వామ్యాలు వంటివి ఆ కాలానికి ఎంతో ముందస్తు విధానాలుగా నిలిచాయి. హైటెక్ సిటీతో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), జీనోమ్ వ్యాలీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వంటి ఎన్నో భారీ ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశారు.

1990ల చివరిలో దేశమంతా ఐటీ రంగంలో దూసుకుపోతున్న సమయంలో, అప్పటి ఐటీ హబ్‌గా ఉన్న బెంగళూరుకు పోటీగా హైదరాబాద్‌ను నిలబెట్టాలని చంద్రబాబు భావించారు. బై-బై బెంగళూరు, హలో హైదరాబాద్ అనే నినాదంతో ఆయన దేశం దృష్టిని హైదరాబాద్‌పై ఆకర్షించారు. ఐటీ పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా (PPP Model)ను ప్రవేశపెట్టారు. L&Tతో కలిసి సైబర్ టవర్స్ నిర్మించి, హైదరాబాద్‌ను ప్రపంచానికి ఒక నూతన టెక్ నగరంగా పరిచయం చేశారు.

నేటికీ చంద్రబాబు నాయుడిని టెక్నాలజీ ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ అని పిలవడానికి ఆయనకు ఉన్న దార్శనికత, సుస్థిర ప్రణాళికలే కారణం. విజన్ 2020, విజన్ 2047 వంటి వాటితో దశాబ్దాల ముందుగానే ఆలోచించే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు పోటీగా హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన తొలి, దార్శనిక నేతగా చంద్రబాబు పేరు చరిత్రలో సుస్థిరం అయింది.

Also read: War 2: వార్ 2 బాక్సాఫీస్ సునామీ..రెండు రోజుల్లోనే రికార్డుల మోతలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button